భారత దేశంలో సార్వత్రిక ఎన్నికల ఆఖరి విడత పోలింగ్ నేడు (శనివారం) జరుగుతోంది. ఈ విడతలో 57 లోక్‌సభ స్థానాలకు బిహార్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌లో ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ ఎన్నికల అనంతరం అందరి దృష్టి ఫలితాలపై కేంద్రీకృతం కానుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా పలు న్యూస్ చానెల్స్ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ గణాంకాలను విడుదల చేయనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడే సమయానికి దేశవ్యాప్తంగా ప్రజలు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతారు.
ఇంకా చదవండి: సర్వత్రా ఉత్కంఠ, కీలక రాష్ట్రాలలో తుది పోరు! ముగింపు దశ పోలింగ్!
మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లు ఈ సారి వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చాయి. ముంబైలో ఎస్ఎం 5 కళ్యాణ్, సియాన్, నాగ్పూర్‌లోని మూవీమ్యాక్స్ ఎటర్నిటీ, కంజుర్‌మార్లోని మూవీమ్యాక్స్, థానేలోని ఎటర్నిటీ మాల్, వండర్ మాల్, పుణెలోని మూవీమ్యాక్స్, మీరా రోడ్ ప్రాంతంలోని మూవీమ్యాక్స్ చైన్ ఆఫ్ థియేటర్లు జూన్ 4న ఎన్నికల ఫలితాలను ప్రదర్శించనున్నాయి.
ఇందుకోసం ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ల విక్రయాలు మొదలయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి థియేటర్లలోకి ప్రవేశం ఉంటుంది. సుమారు 6 గంటల పాటు థియేటర్లలో ఎన్నికల ఫలితాలను ప్రదర్శిస్తారు. టికెట్ ధర రూ.99 నుంచి రూ.300 వరకు ఉంటుంది. బిగ్ స్క్రీన్‌పై ఎన్నికల ఫలితాలు చూడాలని ఆసక్తి ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో చాలా థియేటర్లు ఇప్పటికే హౌస్‌ఫుల్ అయిపోయాయి.
ఇంకా చదవండి: పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ హాట్ కామెంట్స్! కేసుల్లో ఇరుక్కొని సామాన్యులు! ఇంతలా ఫ్యాక్షనిజం ఉందా అని!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పోరాడి విజయం సాధించిన ABV! పోస్టింగ్ ఇవ్వనున్న ప్రభుత్వం!
ఎన్నారై నుండి ఐఎన్ఐ ఎస్ ఎస్ వరకు! డాక్టర్ అఖిల్ విజయం!
ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక! పలు మండలాల్లో తీవ్రవడగాల్పులు! అప్రమత్తంగా ఉండాలి!
కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్! కౌంటింగ్ రోజున ఆంక్షలు, భద్రతా చర్యలు!
కార్డన్ సెర్చ్‌లో పోలీసుల ప్రతాపం! రౌడీషీటర్లు అదుపులో! పత్రాలు లేని వాహనాల సీజ్!
సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్! రెచ్చగొట్టేలా మాట్లాడడం కోడ్ ను..దేవినేని
ఏపీ హైకోర్టులో వైసీపీ పిటిషన్!ఈసీ మెమోలను రద్దు చేయాలన్న డిమాండ్!
ఎన్నికల కోడ్ లో టీచర్ల బదిలీ ఎలా? ఆందోళన బాటలో ఏపీ ఉద్యోగుల సంఘం! EC రియాక్షన్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: