రంగారెడ్డి: ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల ప్రచారాలతో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే రాజకీయ బరిలో నిలిచిన నాయకులు నామినేషన్స్ దాఖలు చేశారు. తాజాగా రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని దాసరి సాహితి బరిలోకి దిగుతున్నారు. ‘
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మా ఊరి పొలిమేర’, ‘మా ఊరి పొలిమేర 2’ సినిమాల్లో దాసరి సాహితి కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ‘పొలిమేర’ సినిమాలో గెటప్ శ్రీను భార్యగా నటించిన సాహితి.. ‘పొలిమేర 2’లో సత్యం రాజేష్ సరసన నటించింది. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు దాసరి సాహితి పొలిటికల్ బాట పట్టారు. ఆవిడ బుధవారం రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంకకు ఆమె నామినేషన్ సమర్పించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి బీజేపీ నుండి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి నుంచి కాసాని జ్ఞానేశ్వర్ బరిలో ఉండగా.. ఇప్పుడు దాసరి సాహితి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. రీసెంట్‌గా ఆమె సోషల్ మీడియా వేదికగా రాజకీయాల గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. తను పవన్ కళ్యాణ్‌కు అభిమానినని, తన రీల్స్‌కు రాజకీయాలను ఆపాదించవద్దంటూ కోరారు. ఇప్పుడు ఏకంగా రాజకీయాల్లోకే అడుగు పెట్టడంతో దీనిపై పలు ఆసక్తి కరమైన చర్చలు సాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా: గత వారం జరిగిన దాడులపై తనిఖీలు! అరెస్ట్ అయిన 12 మంది! ఎక్కువగా యువకులే!
ఎన్నికల నామినేషన్ లో పాల్గొన్న NRI TDP ఐర్లాండ్ సభ్యులు! చీపురుపల్లి లో స్వాగతించిన కళ వెంకట రావు!
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి