అమెరికా పర్యటనలో ఉన్న మెగాస్టార్ చిరంజీవిని అక్కడి అభిమానులు ఘనంగా సన్మానించారు. చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో... అమెరికాలోని మెగా ఫ్యాన్స్ లాస్ ఏంజెల్స్ నగరంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఇక్కడి రిట్జ్ కార్ల్ టన్ డ్రైవ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అమెరికాలోని చిరు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సత్కారం సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, తనకు వచ్చిన అవార్డును చూసి అభిమానులు అది తమకే వచ్చినంతగా సంబరపడుతున్నారని తెలిపారు. అమెరికా గడ్డపై తన అభిమానులను చిరంజీవి ముగ్ధులయ్యారు.
అవార్డు వచ్చినప్పుడు, గుర్తింపు లభించినప్పుడు నిజంగా ఆనందమేనని, అయితే, తనకు అవార్డు రావడం పట్ల ఇంత మంది ప్రతిస్పందిస్తుండడం చూసి తనకెంతో సంతోషంగా అనిపిస్తోందని చిరంజీవి పేర్కొన్నారు. ఇంతమంది తమ ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తుంటే ఇది కదా నిజమైన ఆనందం అనిపిస్తోందని అన్నారు. ఇంతకంటే అవార్డు ఇంకేముంటుందని వ్యాఖ్యానించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి