అనకాపల్లి జిల్లా : పాయకరావుపేట నియోజకవర్గంలో ఏకధాటిగా వర్షం కురుస్తుంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలకు తాండవ, వరాహ నదుల్లోకి వచ్చి వరద చేరుతుంది. విద్యా సంస్థలకు నేడు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షాలు, రహదారులు జలమయం అయ్యాయి. రైవాడ, కొనాం జలాశయాల్లోకి భారీగా వరద చేరుతుంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయ ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడం జరిగింది.
అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు కొండ వాగులు పొంగుతున్నాయి. కొన్ని చోట్ల వాగులు పొంగి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. పాడేరు మండలం రాయిగడ్డ, పరదానిపుట్టు వద్ద పొంగుతున్న మత్స్యగెడ్డ. జి.మాడుగుల మండలం కుంబిడిసింగి బ్రిడ్జిపై వరద ప్రవాహం, రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. పెదబయలు మండలం గిన్నెలకోట, జామిగూడలో గెడ్డలు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. ముంచంగిపుట్టు మండలం బిరిగూడ గెడ్డ పొంగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అరకులో నియోజకవర్గం వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. డుంబ్రిగూడ మండలం బొందగూడ వద్ద కాజ్ వేపై వర్షపు నీటి ప్రవాహం. మరమ్మతులో ఉన్న కాజ్ వేపై వర్షపు నీటితో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. కర్నూలు, విశాఖ, అనకాపల్లి, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షంతో జనజీవనం అతలాకుతలం అవుతుంది. అన్ని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు.
ఏలూరు జిల్లా : పోలవరం ప్రాజెక్టు వద్ద భారీగా గోదావరి నీటిమట్టం పెరిగిపోతుంది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే ఎగువ నీటిమట్టం 29 మీటర్లకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే దిగువ నీటిమట్టం 19.16 మీటర్లు ఉంది. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ నీటిమట్టం 29.15 మీటర్లు ఉంది. పోలవరం దిగువ కాఫర్ డ్యామ్ నీటిమట్టం 18.70 మీటర్లు. పోలవరం స్పిల్ వే నుంచి 3.50 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
లోకేశ్ చొరవతో కువైట్ నుంచి ఏపీకి చేరుకున్న శివ! ఆదుకోకపోతే చావే దిక్కు అంటూ కన్నీటితో..
కొడాలి షాక్.. కోర్టును ఆశ్రయించిన పాఠశాల యాజమాన్యం! ఇక జైలుకేనా?
బాలిక అదృశ్యం ఘటనలో చర్యలు.. ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు!
విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు! సకాలంలో వైద్యసేవలు అందేలాజేసిన భువనేశ్వరి!
జగన్‌పై కేంద్ర మాజీ మంత్రి విమర్శలు! రాజకీయ వాతావరణంలో కలకలం! ఆరు నెలల్లో ఈయన ఎక్కడ ఉంటారో?
భరించలేని కీళ్ళ నొప్పులు ఈ సూపర్ ఫుడ్స్ తో తగ్గుతాయి! మరీ ఎందుకు ఆలస్యం తెలుసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: