ఏపీలో వచ్చే ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో.. సోమ, మంగళవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు, ద్రోణుల ప్రభావానికి తోడు, ఈశాన్య అస్సాం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు, పశ్చిమ అస్సాం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు వేర్వేరుగా ద్రోణులు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ జిల్లాల ప్రజలకు రెయిన్ అలెర్ట్..
అంతేకాదు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణ, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్య సాయి, వైయస్సార్, అన్నమయ్య, మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిన్న సాయంత్రం 5 గంటల వరకు 61 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇంకా చదవండి: రాజధాని నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ సంస్థలకు బాధ్యతలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ఐఏఎస్ బదిలీలపై కీలకమైన మార్పులు ! 19 మంది కొత్త పాత్రల్లో !
ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!
ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: