దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గోవా, ముంబైకి రెడ్ అలెర్ట్ జారీ చేసింది. దాదాపు 10 రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. గోవాలో రాబోయే రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గోవాకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది., ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముంబై, పూణే ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా రెండు నగరాల్లోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. రాయ్ గఢ్ లోనూ భారీగా వర్షం కురిసింది. అక్కడ కూడా అధికారులు.. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు, ముంబైలో మంగళవారం తెల్లవారుజామున 176 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

కోస్తా ప్రాంతంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక తీర ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అంచనావేసింది. అంతేకాకుండా, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మహారాష్ట్ర సహా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఉత్తరాఖండ్ కు వరద హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జూలై 10న తెహ్రీ, పౌరీ, భాగేశ్వర్, అల్మోరా, నైనితాల్, చంపావత్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. దేశరాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

దగా ప్రభుత్వానికి - ప్రజా ప్రభుత్వానికి తేడా అదే! కాంగ్రెస్ ట్వీట్!

ఏపీలోని నిరుద్యోగులకు మరో శుభవార్త! తిరుపతిలో జాబ్ ఆఫర్స్! వెంటనే అప్లై చేసేయండి!

అమెరికాలో విషాదం... మరో తెలుగు విద్యార్ధి మృతి! గత నెలలో ఇదే కుటుంబానికి చెందిన...

ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న ప్రాణాంతక వ్యాధి! మెదడును తినే అమీబా!

ఎంవీవీ, జీవీలకు నో ఎంట్రీ! తేల్చిచెప్పిన సీఎం చంద్రబాబు! డిప్యూటీ సీఎం కూడా అదే బాటలో!

కడప ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే జరిగేది అదే! రేవంత్ రెడ్డి ఏమన్నారంటే!

రైతు భరోసా అమలుపై చంద్రబాబు కీలక నిర్ణయం! ఏంటో చూసేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group