నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం, ఒక రోజు ముందుగానే అంటే గురువారానికి, అవి కేరళను తాకుతాయి. తర్వాత రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ నెల 31 లేదా వచ్చే నెల 1న రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించవచ్చని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే దక్షిణ అరేబియా సముద్రంలోని చాలా ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లో విస్తరించాయి. వీటి పురోగమనం ఆశాజనకంగా ఉండడంతో గురువారం లక్షద్వీప్, కేరళ, నైరుతి, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం మరియు ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉంది.

ఇంకా చదవండి: తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

రుతుపవనాలు వారం ముందుగానే పురోగమిస్తున్నందున ఈ సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల పురోగమనం మరియు రెమల్ తుఫాన్ కారణంగా రోహిణీ కార్తె ప్రభావం రాష్ట్రంపై పెద్దగా లేకుండా ఉంది. స్వల్పంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. బుధవారం పలుచోట్ల 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా పోయిమలలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా చిరుమామిళ్లలో 42.5, గరికపాడులో 42 డిగ్రీలు, విజయవాడలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే రెండు రోజులు కూడా వాతావరణం ఇలానే ఉండవచ్చని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

ఇంకా చదవండి: EC మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు! వీడియో కాన్ఫరెన్స్ తో సమీక్ష! వచ్చే నెల 4న!

రాష్ట్రంలో జూన్ 1నుంచి వర్షాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 1న అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. జూన్ 2న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ సమయంలో గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి

ఏపీలో రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక! రైల్వే ట్రాక్‌, ఇతర నిర్వహణ పనులు కారణంగా! ఈ రైళ్లన్ని ఒకేసారి రద్దు కావడంతో రైల్వే స్టేషన్‌లు!

జూన్ 3న పవన్ కల్యాణ్ కీలక సమావేశం! ఏపీలో ఎన్నికల కౌంటింగ్! పార్టీ కార్యాలయం నుంచి పర్యవేక్షించనున్నారు!

పల్నాడు ఎస్పీ కార్యాలయానికి పిన్నెల్లి! పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రతిరోజు SP ఆఫీసులో సంతకం చేయాల! అర్ధరాత్రి SP ఆఫీసు!

ఆత్మకూరు మండలం బసవరాజుపాలెంలో వైసీపీ దౌర్జన్యం! పోలీసులపై తిరగబడిన వైసీపీ నేతలు!

టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍లో "పిన్నెల్లి పైశాచికం" పుస్తక ఆవిష్కరణ! పుస్తకాల్లో కూడా రూ.15 వేలు దోచుకునే! మాచర్లలో మారణహోమం సృష్టించారు!

మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి వ్యక్తి మృతి! పైప్ లైన్ల ద్వారా వచ్చే నీటిని తాగొద్దని సూచన! ఆరుగురు వీఎంసీ అధికారుల సస్పెన్షన్!

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు! హాజరు కాలేనంటూ లేఖ!

పురిట్లోనే బిడ్డ చనిపోయిందని తెలిసి ఆగిన తల్లి గుండె! ఎన్నో ఆశలతో.. చివరికి ఇలా! హృదయాలను కదిలించే ఘటన!

కడపలో జూన్ 4వ తేదీ ఆర్టీసి బస్సులను నిలిపివేత! జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలు!

నింగిలోకి వెళ్లాల్సిన రాకెట్ ప్రయోగం వాయిదా! సెమీ క్రయోజనిక్ ఇంజిన్!

నకిలీ ధ్రువీకరణ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్! లింక్ డాక్యుమెంట్లు ఇవ్వకుండా ముప్పుతిప్పలు! చేయి కలిపిన సబ్ రిజిస్ట్రార్ సహా 9 మందికి బేడీలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group