రేపు 72 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 200 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 165 మండలాల్లో తీవ్రవడగాల్పులు,149 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (72):
శ్రీకాకుళం 3, విజయనగరం17, పార్వతీపురంమన్యం 10, అల్లూరి 2, అనకాపల్లి 2, కాకినాడ 6, కోనసీమ 2,
తూర్పుగోదావరి 17, పశ్చిమగోదావరి 3, ఏలూరు 7, కృష్ణా 2, బాపట్ల కొల్లూరు మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (200):
శ్రీకాకుళం 12, విజయనగరం 7, పార్వతీపురంమన్యం 5, అల్లూరిసీతారామరాజు 8, విశాఖ 1, అనకాపల్లి 14, కాకినాడ 14, కోనసీమ11, తూర్పుగోదావరి 2, పశ్చిమగోదావరి 13, ఏలూరు 21, కృష్ణా 19, ఎన్టీఆర్ 17, గుంటూరు 17, పల్నాడు 12, బాపట్ల 19, ప్రకాశం 8 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
ఆదివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 40.9°C, పల్నాడు జిల్లా నరసరావుపేలో 40.8°C, ప్రకాశం జిల్లా కనిగిరిలో 40.7°C, తిరుపతి జిల్లా నాయుడుపేటలో 40.6°C, కాకినాడ జిల్లా తుని, కృష్ణా జిల్లా కంకిపాడులో 40.5°C, నెల్లూరు జిల్లా మనుబోలులో 40.4°C, ఏలూరు జిల్లా పెదవేగిలో 40°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.
ఇవి కూడా చదవండి:
ABV పోస్టింగ్ పై కొనసాగుతున్న ఉత్కంఠ! రిటైర్మెంట్ కు ఇంకా 4 రోజులే! ప్రభుత్వం ఏం చేయనుంది!
ప్రయాణికులకు ముఖ్య గమనిక! యూఏఈ-ఇండియా మధ్య పలు విమానాలు రద్దు! రెమల్ తుఫాను కారణంగా!
కువైట్: అక్రమ మద్యం తయారీ కేంద్రం సీజ్! నలుగురు ప్రవాసులు అరెస్ట్!
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన రేవ్ పార్టీ కేసు! ఏపీ మంత్రి అనుచరుడి అరెస్ట్!
58 లోక్‌సభ స్థానాలకు మొదలైన పోలింగ్! 6వ దశ పోలింగ్ షురూ! 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో!
హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడిన యువత! రక్షించి విశాఖ చేర్చిన పోలీసులు! చంద్రబాబు X లో పోస్ట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: