న్యూయార్క్ నగర హృదయంలో నిలిచిన గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ రైల్వే స్టేషన్ ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుత నిర్మాణంగా నిలిచింది. 122 ఏళ్ల చరిత్ర గల ఈ టెర్మినల్ ప్రస్తుతం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రపంచంలోనే పొడవైన రైల్వే స్టేషన్‌గా నిలిచింది. మొత్తం 44 ప్లాట్‌ఫామ్‌లు రోజుకు 660 రైళ్లు, సగటున 1.25 లక్షల ప్రయాణికులు ఈ అంకెలు దీని విస్తృతాన్ని తెలుపుతున్నాయి.
1903లో నిర్మాణం ప్రారంభమై 1913లో పూర్తి అయింది ఈ టెర్మినల్ కేవలం రవాణా కేంద్రం కాదు న్యూయార్క్ గౌరవ చిహ్నం కూడా. భూమి పైభాగంలోనే కాకుండా భూగర్భంలో కూడా ప్లాట్‌ఫామ్‌లు ఉండటం దీని ప్రత్యేకత. మొత్తం 48 ఎకరాల విస్తీర్ణంలో ఈ అద్భుత నిర్మాణం విస్తరించి ఉంది.
ఈ స్టేషన్లో రెండు ఫ్లోర్లు ఉండగా, పై ఫ్లోర్లో 41 ట్రాక్‌లు, దిగువ ఫ్లోర్లో 26 ట్రాక్‌లు ఉన్నాయి. అంత రైళ్లు ఒకేసారి రాకపోకలు సాగించేలా ప్లాన్ చేయబడటం ఆ కాలంలోనే ఇంజినీరింగ్ అద్భుతం. దీని గోడలు, పైకప్పు అలంకరణలు, మధ్యలో ఉన్న భారీ గడియారం ఇవన్నీ కలిపి ఈ స్టేషన్‌ను ప్రపంచంలోని అందమైన రైల్వే టెర్మినల్లలో ఒకటిగా నిలబెట్టాయి.
మరో ఆసక్తికర అంశం ఈ టెర్మినల్‌లోని వాల్డార్ఫ్ ప్లాట్‌ఫామ్. ఇది రహస్యంగా ఉన్న ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌గా పేరు పొందింది. అమెరికా చరిత్రలోని ప్రముఖ నాయకులు, గౌరవ అతిథుల కోసం దీనిని ఉపయోగించేవారని చెప్పుకుంటారు. అలాగే ఇక్కడి లాస్ట్ అండ్ ఫౌండ్ విభాగం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. పాస్‌పోర్టులు, బంగారం నుంచి అరుదైన వస్తువుల వరకూ ఇక్కడ దొరికిన సంఘటనలు నమోదు అయ్యాయి.
న్యూయార్క్‌లోని 42వ వీధి, పార్క్ అవెన్యూ కూడలిలో ఉన్న ఈ టెర్మినల్ ప్రతి రోజు వేలాది ఉద్యోగులు, విద్యార్థులు, పర్యాటకులతో కిక్కిరిసిపోతుంది. కేవలం రవాణా కేంద్రం మాత్రమే కాకుండా, ఇది ఒక సాంస్కృతిక చిహ్నం, నిర్మాణ కళాఖండం.
గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ పేరు వినగానే అమెరికా మాత్రమే కాదు, ప్రపంచ రైల్వే చరిత్రలోని ఒక అద్భుత ఘట్టం గుర్తుకు వస్తుంది. ఇది కేవలం స్టేషన్ కాదు... శతాబ్దాల చరిత్రను మోసే రవాణా చిహ్నం.