భారీ జీతంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో జాబ్స్ నవంబర్ 14 చివరి తేదీ.. పూర్తి వివరాలు ఇవే!

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులలో అత్యంత ప్రాచుర్యం పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ మళ్లీ వివాదాల తుఫానులో చిక్కుకుంది. ప్రతీసీజన్‌లో తన కంటెంట్‌, టాస్క్‌లు, పాల్గొనేవారి ప్రవర్తనపై విమర్శలు ఎదుర్కొనే ఈ కార్యక్రమం ఇప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్‌ దాకా చేరింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ షోపై అశ్లీలతను ప్రోత్సహిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నదనే ఆరోపణలతో ఫిర్యాదు నమోదైంది.

వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ముఖ్యమైన అప్‌డేట్‌లను మిస్ అవ్వకుండా.! మెటా కొత్త అప్‌డేట్!

సిద్దిపేట జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు — కమ్మరి శ్రీనివాస్‌, బి. రవీందర్ రెడ్డి — ఈ ఫిర్యాదు చేశారు. వారు పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో, “బిగ్ బాస్ షోలో పాల్గొనేవారి ప్రవర్తన, సంభాషణలు కుటుంబ సభ్యులతో కలిసి చూడలేనంతగా ఉన్నాయి. టాస్క్‌ల రూపంలో అశ్లీల సన్నివేశాలను చూపిస్తూ యువతపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ షో సమాజంలో తప్పుడు విలువలను పెంచుతోంది” అని పేర్కొన్నారు. సమాజంపై దీని ప్రభావం దృష్ట్యా చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.

పెద్ది పై బుచ్చిబాబు బిగ్ అప్‌డేట్.. చరణ్ ఫ్యాన్స్‌కు దీపావళి గిఫ్ట్ రెడీ!

ఇంతకుముందు కూడా ‘బిగ్ బాస్’ పలు సార్లు వివాదాల్లో చిక్కుకుంది. కొందరు సామాజిక సంస్థలు, మతపరమైన సంస్థలు కూడా ఈ కార్యక్రమాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేసిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పటివరకు ఆ విమర్శలు పెద్దగా చట్టపరమైన చర్యలుగా మారలేదు. కానీ ఈసారి నేరుగా పోలీస్ ఫిర్యాదు రావడం టీవీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కూడా “బిగ్ బాస్‌లో హద్దులు దాటుతున్న సన్నివేశాలు” అనే కామెంట్లు విస్తరిస్తున్నాయి.

యూరప్‌లో తొలి స్ట్రీట్‌ లైటింగ్‌ వ్యవస్థను ప్రారంభించిన నగరం ఏదో మీకు తెలుసా!

బిగ్ బాస్ నిర్మాతల నుండి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు. షో నిర్వాహకులు ఈ ఆరోపణలను ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. అయితే, ప్రతి సంవత్సరం కొత్త సీజన్‌ ప్రారంభం కాగానే, కొన్ని ఎపిసోడ్‌లు ప్రసారమైన వెంటనే వివాదాలు మొదలవడం సాధారణం కావడం గమనార్హం. ప్రేక్షకులలో ఒక వర్గం ఈ షోను “వినోదాత్మకంగా” చూస్తే, మరో వర్గం మాత్రం “సామాజిక విలువలను దెబ్బతీసే కార్యక్రమం”గా విమర్శిస్తుంది.

దీపావళి బంపర్ ఆఫర్.. ఐఫోన్ 16 ప్రోపై భారీ డిస్కౌంట్.. ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో తెలుసా? మిస్ అవ్వొద్దు!
ఆంధ్రప్రదేశ్‌లో చికెన్, మటన్ షాప్‌లకు కొత్త నియమాలు.. అది తప్పనిసరి!!
సామాన్యుల EV కల నెరవేరే ఛాన్స్ - రూ. 30 వేల డిస్కౌంట్ ఆఫర్! 100 కి.మీ.కి రూ. 20 ఖర్చు.. బ్లాక్ బస్టర్ కాంబో..
Farmers: రైతులకు కీలక హెచ్చరిక..! ఆది ఎక్కువ వాడితే సబ్సిడీ లేదు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!
శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ!
Google vizag: విశాఖలో గూగుల్ AI హబ్‌పై సీఎం సంతోషం.. యంగెస్ట్ స్టేట్, హై ఇన్వెస్ట్మెంట్ హాష్‌ట్యాగ్.. వైజాగ్ లోని G అంటే!