ఉత్తరప్రదేశ్ సహారన్పూర్ జిల్లా : నేటి కాలంలో మద్యం, పొగాకు లేని ఊరు అనగానే అది ఒక కలలా అనిపిస్తుంది. కానీ ఉత్తరప్రదేశ్‌లోని మిర్గపుర్ గ్రామం ఆ కలను నిజం చేస్తోంది. 600 ఏళ్లుగా ఆ ఊరిలో ఒక్కరైనా మద్యం తాగిన, సిగరెట్ తాగిన, మాంసం తిన్న చరిత్రే లేదు!
ఈ సంప్రదాయం సాధారణం కాదు ఇది ఆ గ్రామానికి ఓ జీవన విధానం. మద్యం, మాంసం, పొగాకు వాడకమంటే ఏమిటో అక్కడి పిల్లలకు కూడా తెలియదు. ఇక్కడ అలవాటు కాదు అండి, పాపం అనుకుంటాం గ్రామస్తులు గర్వంగా చెప్పుకొస్తున్నారు.
బాబా ఫకీరా దాస్’ ఆశీర్వాదం వెనుక రహస్యం
స్థానిక పెద్దలు చెబుతున్న కథ ప్రకారం బాబా ఫకీరా దాస్ అనే సద్గురు ఆరు శతాబ్దాల క్రితం ఈ గ్రామానికి వచ్చారట. ఆయన ఇక్కడి ప్రజలకు ఈ ఊరు ఎప్పటికీ నశాముక్తంగా ఉండాలి, ఎవరూ మద్యం తాకకూడదు, తామసిక పదార్థాలు తినకూడదు అని ఆశీర్వాదం ఇచ్చారు. అప్పటి నుంచి అది గ్రామ చట్టమైపోయింది.
ఇప్పటి వరకు 20 తరాలుగా ఆ మాటే నడుస్తోంది. ఆధునిక యుగంలో కూడా ఎవ్వరూ ఆ నియమాన్ని ఉల్లంఘించలేదు.
మిర్గపుర్లో శాకాహారమే ప్రధాన ఆహారం. ఇక్కడి ప్రజలు ఉల్లిపాయ, వెల్లుల్లి వాడరు. అయినా వారి వంటకాలు రుచిగా ఉంటాయంటారు. మా ఇంట్లో ఉల్లిపాయ లేనంత మాత్రాన వంట బోరుగా ఉండదు. పాపం చేయకపోవడమే రుచి అంటారు ఒక స్థానిక గృహిణి నవ్వుతూ.
గ్రామంలో దాదాపు 50 దుకాణాలు ఉన్నా ఒక్కటీ బీడీ, సిగరెట్, గుట్కా అమ్మరు. మా దుకాణాల్లో మద్యం వస్తువులు లేవు. ఆ నియమాన్ని మేము పెద్దల మాటలా భావిస్తాం అంటున్నారు దుకాణదారుడు రాజ్‌కరణ్.
భజనలతో నిండిన సాయంత్రాలు
ఇతర ఊర్లలా హుక్కా తాగే గుంపులు ఇక్కడ ఉండవు. సాయంత్రం అయ్యిందంటే ప్రతి వీధిలోనూ భజనల శబ్దమే వినిపిస్తుంది. వ్యసనాలేవీ లేనందున గ్రామం ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉందని పెద్దలు చెబుతున్నారు.
ఇక్కడ గొడవలు లేవు, పోలీస్ కేసులు లేవు. వ్యసనమంటే పాపం, భజనమంటే ఆనందం అంటారు యువకులు చిరునవ్వుతో. ప్రభుత్వం మిర్గపుర్ను నశాముక్త్ గ్రామం గా గుర్తించింది. ఈ క్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా గ్రామానికి స్థానం దక్కింది. ఇప్పుడు ఈ గ్రామం ప్రపంచానికి ఓ సందేశం ఇస్తోంది సంతోషంగా బ్రతకాలి అంటే వ్యసనాలకు దూరంగా ఉండాలి ప్రకృతి ఒడిలో ఆనందంగా తుది శ్వాస విడవాలి.