తిరుమల తాజా సమాచారం! సర్వదర్శనానికి 12 గంటల సమయం!

ఆంధ్రప్రదేశ్ మౌళిక వసతుల మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నారాయణ ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం. మంత్రి నారాయణ బృందం పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక, ఆరోగ్య మరియు మౌళిక వసతుల రంగాల అభివృద్ధికి మార్గం సుగమం కానుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.

Jobs notification: CTET రిజిస్ట్రేషన్ త్వరలో – ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష..పూర్తి దరఖాస్తు సమాచారం!!

నిన్న జరిగిన సమావేశాల్లో మంత్రి నారాయణ, శోభా రియాల్టీ గ్రూప్, KEF హోల్డింగ్స్, బుర్జీల్ హోల్డింగ్స్ ప్రతినిధులతో వేరువేరుగా భేటీ అయ్యారు. ఈ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపించాయి. ముఖ్యంగా బుర్జీల్ హోల్డింగ్స్ మరియు KEF హోల్డింగ్స్ సంస్థలు ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇవి ఆసుపత్రులు, వైద్య సదుపాయాలు, వైద్య పరికరాల తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.

విశాఖలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు!

శోభా రియాల్టీ గ్రూప్ మౌళిక వసతుల రంగంలో పెట్టుబడులకు ఆసక్తి కనబరిచింది. ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్, స్మార్ట్ సిటీస్, హౌసింగ్ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ గ్రూప్ చర్చలు జరిపింది. మంత్రి నారాయణ ఈ సంస్థల ప్రతినిధులను ఈ నెల 14, 15 తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు (Global Investors Meet) హాజరుకావాలని ఆహ్వానించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం అనుకూల వాతావరణం, పారదర్శక విధానాలు, సులభమైన అనుమతుల విధానం వంటి అంశాలను వివరించారు.

PM Kisan పథకం 15వ విడత రిలీజ్‌కి కౌంట్‌డౌన్‌ స్టార్ట్.. రైతుల ఖాతాల్లోకి త్వరలోనే రూ.2,000!

ఈరోజు కూడా మంత్రి నారాయణ పలు సమావేశాల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా ఆపరెల్ గ్రూప్, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, టబ్రీడ్ గ్రూప్ ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగంలో దుబాయ్ కేంద్రంగా అనేక దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ పోర్టులు మరియు లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

లండన్ పర్యటనలో సీఎం చంద్రబాబు! హిందూజా గ్రూప్‌తో కీలక ఒప్పందం... ఆంధ్రప్రదేశ్‌కు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!

ఆపరెల్ గ్రూప్, ఫ్యాషన్ మరియు ఫుట్‌వేర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సంస్థ. ఇది కూడా రాష్ట్రంలో ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపనుందని తెలిసింది. ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల రూపంలో కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. మంత్రి నారాయణ పర్యటనతో రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు పడిందని అధికారులు పేర్కొన్నారు.

ఏపీ ప్రజలకు మరో శుభవార్త! రూ.4,260 కోట్లతో అంతర్జాతీయ క్యాన్సర్ సెంటర్.. ఇక్కడే ఫిక్స్!
గుడ్ న్యూస్.. మరో నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు! దేశవ్యాప్తంగా 164కి చేరిన సర్వీసులు!
5 డాలర్ల జీతం నుంచి యజమాని స్థాయికి.. ఇండియన్-అమెరికన్ అమోల్ కోహ్లీ సక్సెస్ స్టోరీ! పాత్రలు కడిగిన చోటే.!
Bhagavad Gita: నేను దేహం కాదని తెలిపే పరమజ్ఞానమే నిజమైన ఆత్మసాక్షాత్కారం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -50!
MoRTH: రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు మరో కీలక అడుగు.. MoRTH చర్యలు వేగం!