Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్! TTD Tokens: తిరుమల భక్తులకు కీలక ప్రకటన! ఇకనుండి ఆ టోకెన్లు పాత పద్ధతిలోనే.... AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం! ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్! TTD Tokens: తిరుమల భక్తులకు కీలక ప్రకటన! ఇకనుండి ఆ టోకెన్లు పాత పద్ధతిలోనే.... AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం! ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం!

Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!!

2025-11-06 14:32:00

రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి తానేటి  అనిత  మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నేటి యువతే రేపటి ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు. అందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువత రక్షణ, భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు” అని తెలిపారు.

డ్రగ్స్‌ సమస్యపై ప్రభుత్వం సున్నా సహనం విధానాన్ని అవలంబించిందని ఆమె చెప్పారు. ఈగల్‌ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా గంజాయి సాగును దాదాపు జీరో స్థాయికి తగ్గించామని వివరించారు. “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదాన్ని పాఠశాల స్థాయికి తీసుకెళ్లి, 50 వేల స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

“ఒక తల్లి తన కుమార్తెను రక్షించండి అని వేడుకున్న సందర్భం నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ ఘటన తర్వాతే డ్రగ్స్‌ను రాష్ట్రం నుంచి పూర్తిగా తుడిచిపెట్టాలని సంకల్పించాం,” అని అనిత గారు చెప్పారు.

వైసీపీ పాలనలో డ్రగ్స్‌ దందా విస్తరించిందని ఆమె తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం యువతకు చెడు అలవాట్లు దూరం చేయాలని ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అంటుంటే, వైసీపీ మాత్రం ‘డ్రగ్స్ తీసుకో బ్రో’ అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. జగన్‌మోహన్ రెడ్డి పాలనలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ ను గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయింది, అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనలో దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌కే దారి తీసేవని అనిత గారు తెలిపారు. “జగన్ ఐదేళ్ల పాలనలో డ్రగ్స్‌పై ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదు. అయితే ప్రస్తుతం మా ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసి, ఈగల్‌, టాస్క్‌ఫోర్స్‌, రైల్వే పోలీస్‌లతో సమన్వయంగా పనిచేస్తోంది” అని వివరించారు.

యువత భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రగతి కోసం డ్రగ్స్‌ వ్యసనాన్ని పూర్తిగా అంతమొందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హోం మంత్రి అనిత  స్పష్టం చేశారు.

Spotlight

Read More →