పతనావస్థలోకి వెళ్లిన వైసీపీ! నైరాశ్యంలో పార్టీ నేతలు! మేక పోతు గాంభీర్యం

ఆంధ్రప్రదేశ్లో వైసిపి ప్రభుత్వం ఓడిపోయి అధికారంలో నుంచి దిగడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ అధినేత సంకేతాలు ఇచ్చారు. ఇండియా టుడే తిరుపతిలో ఇచ్చిన ఇంటర్వ్యూలో

Published : 2024-02-07 18:12:00

ఆంధ్రప్రదేశ్లో వైసిపి ప్రభుత్వం ఓడిపోయి అధికారంలో నుంచి దిగడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ అధినేత సంకేతాలు ఇచ్చారు.

ఇండియా టుడే తిరుపతిలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈయన నైరాశ్యం స్పష్టంగా కనిపిస్తోంది

2019 ఎన్నికలలో పార్టీ ల వారీగా పోలైన ఓట్ల శాతం వైసీపీ:49.5 టీడీపీ:39.5 జనసేన:7 ఇతరులు:4.

2024ఎన్నికలలో TDP, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి.

2019ఎన్నికలలో అప్పటి వైసీపీ ప్రభంజనం లో కూడా టీడీపీ కి 39.5శాతం ఓట్లు, జనసేనకు ఏడు శాతం ఓట్లు పడ్డాయి.

జనసేన టిడిపి ఓట్లకు ఆధారంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో 2024 ఎన్నికలలో టిడిపి జనసేన కూటమి విజయ దుందుభి మోగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వైసిపి ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా తగ్గే ఓట్ల శాతం కూడా గణనీయంగా పెరిగింది.

ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్స్,అంగన్వాడీ ఉద్యోగులు 10 లక్షలు. వారి కుటుంబ సభ్యుల ఓట్లు ఇంటికి 4 చొప్పున 40 లక్షలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారు.

వైసీపీ కోల్పోయే ఓట్ల మొత్తం ప్రత్యామ్నాయం టీడీపీ, జనసేన కూటమికి వేస్తారు.

నిరుద్యోగులు కనీసం 1 DSC నోటిఫికేషన్ కూడా ఇవ్వని కారణంగా D.ed మరియు బి.ఎడ్ చేసిన వారు 5 లక్షల మంది తీవ్ర వ్యతిరేకత తో ఉన్నారు. వారి కుటుంబ సభ్యుల ఓట్లు 10 లక్షలు. ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ లు లేని కారణంగా10 లక్షల ఓట్లు వ్యతిరేకంగా వున్నవి. మొత్తం 20 లక్షల నిరుద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఓట్లలో కనీసం 20 లక్షలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడుతాయి. ఇది గ్రాడ్యుయేట్ ఎన్నికలలో రుజువైంది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ప్రభుత్వం కోల్పోయే ఓట్ల శాతం టీడీపీ, జనసేన కూటమికి కలుస్తాయి.

ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు.

రాజధాని ప్రాంత రైతులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు.

అదేవిదంగా రాష్ట్రము లో అభివృద్ధి కుంటుపడిందని ప్రధానంగా పట్టణ ఓటర్లు, సబ్సిడీ లు రద్దు చేసారని తటస్థ రైతులు, నిత్యావసర ధరలు, మద్యం ధరలు, విద్యుత్ చార్జీలు పెంచడం పట్ల ప్రభుత్వం మీద వ్యతిరేకంగా వున్నవారు లెక్కకు మిక్కిలి ఉన్నారు.

ప్రభుత్వం కోల్పోయే ఓట్లకు టీడీపీ, జనసేనకి పడుతుంది. ఇక ప్రత్యామ్నాయం లేదు.

SC, ST, మైనారిటీ వర్గాల్లో వారి మీద దాడులు, దౌర్జన్యాలా, SC, ST సబ్ ప్లాన్ నిధులు, కార్పొరేషన్ నిధులు మళ్లించడం కారణంగా వారి ఓట్లు వైసిపి ప్రభుత్వం నష్టపోతుంది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల ఉండడం వలన, బాబాయ్ హత్య కేసు వల్ల వైసీపీ ఓటు చీలుతుంది.

వైసీపీకి అబ్బాయిగారు నిలబడ్డ అనేక వర్గాలలో పెల్లుబిక్కిన వ్యతిరేకత కారణంగా వైసిపి ఓట్లు ఘనంగా తగ్గి 35 శాతంకు పడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

టీడీపీ - జనసేన కూటమి 60 శాతం ఓట్లకు పైగా సాధించి భారీ మెజారిటీతో అధికారం లోకి వస్తుంది.

కాబట్టి మనము తటస్థనంగా అలోచిస్తే ఈ కూడికలు, తీసివేతలు ద్వారా 2024 లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అంచనా వేయవచ్చు.

సోషల్ మీడియాలో వచ్చే సర్వేలలో కూడా అధికార వైసిపి పార్టీ పెయిడ్ సర్వేలు కూడా గందరగోళం సృష్టించవచ్చు.

కానీ రాష్ట్రంలో మన కళ్ళ ముందు జరుగుతున్న అనేక సంఘటనలు ప్రభుత్వ పతనావస్థకు చేరింది అని చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →