బంగారం మార్కెట్లో మరోసారి చలనం కనిపిస్తోంది. పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో పసిడి ధరలు వరుసగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో జియోపాలిటికల్ టెన్షన్లు, డాలర్ బలపడటం, రూపాయి క్షీణత అని కలిసి బంగారం రేట్లను కొత్త గరిష్ట స్థాయిలకు చేర్చాయి. ఫలితంగా దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి.
ఈ రోజు (అక్టోబర్ 19) ఉదయం 6.30 గంటల సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి .
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)₹1,30,860
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)₹1,19,950
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు ₹1,31,010గా ఉండగా, 22 క్యారెట్ల ధర ₹1,21,100కి చేరింది. చెన్నై, బెంగళూరు, కోల్కతా, కేరళ, పుణెలలో కూడా దాదాపు ఇదే స్థాయిలో రేట్లు కొనసాగుతున్నాయి.
వెండి ధరలు మాత్రం పెద్ద మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలో కేజీ వెండి ధర ₹1,90,000గా ఉండగా, ఢిల్లీలో ₹1,72,000 వద్ద ఉంది. బెంగళూరులో కొంచెం తక్కువగా ₹1,80,000గా నమోదైంది.
నిపుణుల అంచనా ప్రకారం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కొనసాగితే బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింత ఎగబాకే అవకాశం ఉంది. అయితే ధరలు రోజువారీగా మారుతుంటాయి కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా రేట్లు తప్పనిసరిగా తెలుసుకోవాలని వారు సూచిస్తున్నారు.