WhatsApp వినియోగదారుల కోసం మరో ఆసక్తికరమైన ఫీచర్ రాబోతోంది. ఫోన్ నంబర్ తెలియకపోయినా, యూజర్ పేరుతోనే కాల్ చేయగలిగే సదుపాయాన్ని WhatsApp పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది కానీ త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటివరకు WhatsAppలో ఒకరిని సంప్రదించాలంటే వారి ఫోన్ నంబర్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. కానీ ఈ కొత్త ఫీచర్ వచ్చాక, ఒకరు తమకు నచ్చిన యూజర్ నేమ్ సెట్ చేసుకోగలరు. ఆ యూజర్ నేమ్ ద్వారా ఇతరులు వారికి మెసేజ్ చేయవచ్చు లేదా కాల్ చేయవచ్చు.
ఎలా పనిచేస్తుంది?
WABetaInfo అనే వెబ్సైట్ ప్రకారం, WhatsApp బీటా వెర్షన్లలో యూజర్ నేమ్‌తో కాల్ చేసే ఆప్షన్ కోసం కోడ్ కనిపించింది. అంటే త్వరలో కాల్స్ ట్యాబ్‌లో ఉన్న సెర్చ్ బార్ ద్వారా ఎవరి యూజర్ నేమ్ టైప్ చేస్తే, వారి ప్రొఫైల్ కనపడుతుంది.
అక్కడి నుంచే వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ బటన్ నొక్కి వారితో మాట్లాడవచ్చు. కానీ, ఆ వ్యక్తి ప్రైవసీ సెట్టింగ్స్ ఎలా ఉంచారో బట్టి, వారి ప్రొఫైల్ ఫోటో లేదా వివరాలు కనిపించవచ్చు లేదా కనిపించకపోవచ్చు.
స్పామ్ కాల్స్‌ను అడ్డుకునే యూజర్‌నేమ్ కీ
ఇలాంటి సదుపాయం వలన అపరిచితులు, స్పామ్ కాల్స్ రావచ్చనే భయం ఉంటుంది. దాన్ని నివారించేందుకు WhatsApp “Username Keyఅనే సెక్యూరిటీ ఫీచర్‌ను కూడా అందించనుంది.
ఈ సదుపాయంలో, మీరు ఎవరి యూజర్ నేమ్ ద్వారా కాల్ చేయాలనుకున్నా, సరైన కీ (అంటే పాస్వర్డ్ లాంటిది) తెలిసి ఉండాలి. ఈ కీ లేకపోతే కాల్ జరగదు. ఇలా ఉండడం వలన అనవసర కాల్స్, స్కామ్ ప్రయత్నాలు తగ్గే అవకాశం ఉంది.
ఇతర కొత్త ఫీచర్లు కూడా రాబోతున్నాయి WhatsApp ఇంకా చాలా కొత్త సదుపాయాలను సిద్ధం చేస్తోంది. అందులో కొన్ని 
ప్రొఫైల్‌కు కవర్ ఫోటో సెట్ చేసే ఆప్షన్
చాట్‌లోనే స్టోరేజ్ మేనేజ్మెంట్
మీడియా, స్టిక్కర్ ఫిల్టర్లు
కొత్త మెసేజ్ లిమిట్స్
ఛానెల్‌లలో క్విజ్ ఫీచర్
ఇవన్నీ ముందుగా బీటా యూజర్లకు టెస్టింగ్ దశలో అందిస్తారు. తర్వాత వాటిని అందరికీ విడుదల చేస్తారు.
ఈ కొత్త ఫీచర్ వలన:
ఫోన్ నంబర్ పబ్లిక్‌గా ఇవ్వకుండానే చాట్ చేయొచ్చు.
ప్రైవసీ పెరుగుతుంది.
స్పామ్ కాల్స్ నుంచి రక్షణ ఉంటుంది.
వ్యాపారాలు లేదా గ్రూపులు తమ బ్రాండ్ నేమ్‌తోనే ప్రజలతో కనెక్ట్ అవ్వవచ్చు.
ఇప్పటివరకు WhatsApp ఈ ఫీచర్ గురించి అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. కానీ ఈ ఫీచర్ బీటా వెర్షన్లలో కనపడటం వలన, త్వరలోనే అందరికీ విడుదలయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Technology: ఫోన్ నంబర్ లేకుండానే చాట్, కాల్ చేసే సదుపాయం – వాట్సాప్ కొత్త ఫీచర్!