పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఉద్యోగాలకు ఆసక్తి ఉన్నవారికి శుభవార్త. దేశవ్యాప్తంగా పీఎన్‌బీ వివిధ బ్రాంచ్‌లలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 750 ఖాళీలు ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నట్లు పీఎన్‌బీ ప్రకటించింది. అభ్యర్థులు 2025 నవంబర్ 23వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులు దేశంలోని పలు రాష్ట్రాల్లో లభ్యమవుతున్నాయి — ఆంధ్రప్రదేశ్‌లో 5, తెలంగాణలో 88, మహారాష్ట్రలో 135, కర్ణాటకలో 85, తమిళనాడులో 85, గుజరాత్‌లో 95, పశ్చిమ బెంగాల్‌లో 90, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అనేక ఖాళీలు ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే కనీసం ఒక సంవత్సరం బ్యాంకింగ్ రంగ అనుభవం అవసరం. సంబంధిత రాష్ట్ర స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం తెలుసు ఉండాలి. వయోపరిమితి 20 నుంచి 30 సంవత్సరాల మధ్యగా నిర్ణయించారు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది. దరఖాస్తు రుసుము కింద జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1180, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు రూ.59 చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మరియు స్థానిక భాషా పరీక్ష ఉంటాయి. ఆన్‌లైన్ రాత పరీక్షను డిసెంబర్ 2025 లేదా జనవరి 2026లో నిర్వహించనున్నారు. పరీక్ష 200 మార్కులకు 200 ప్రశ్నలు ఉంటాయి. రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ వంటి ఐదు విభాగాల నుండి ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ విభాగాల నుంచి ఒక్కోటి 25 ప్రశ్నలు (25 మార్కులు చొప్పున), జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 50 ప్రశ్నలు (50 మార్కులు) ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
తుది ఎంపిక తర్వాత నియమించబడిన వారికి నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు జీతం చెల్లించనున్నారు. అదనంగా డీఏ, హెచ్‌ఆరే, ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. పీఎన్‌బీ లోకల్ బ్యాంక్ ఆఫీసర్‌గా ఎంపికైతే స్థానిక భాష పరిజ్ఞానం ఉన్న వారికి బ్యాంక్ కస్టమర్లతో నేరుగా కమ్యూనికేట్ చేసే అవకాశముంటుంది. ఉద్యోగ భద్రత, ప్రమోషన్ అవకాశాలు, మరియు స్థిరమైన కెరీర్ కోరుకునే అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ మంచి అవకాశం అని నిపుణులు చెబుతున్నారు.