JEE Preparation: కోచింగ్‌ లేకుండానే టాప్‌ ర్యాంక్‌ సాధించండి..! మీ స్మార్ట్‌ టెక్‌ గైడ్‌ ఇది..! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..! JEE Main: జేఈఈ మెయిన్‌–2026 రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..! పరీక్షలు అప్పటి నుంచే ప్రారంభం..! CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..! TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..! Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..! JEE Preparation: కోచింగ్‌ లేకుండానే టాప్‌ ర్యాంక్‌ సాధించండి..! మీ స్మార్ట్‌ టెక్‌ గైడ్‌ ఇది..! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..! JEE Main: జేఈఈ మెయిన్‌–2026 రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..! పరీక్షలు అప్పటి నుంచే ప్రారంభం..! CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..! TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..! Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..!

Student Scholarship: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్! రూ.25వేలతో పాటుగా ప్రతి నెలా రూ.2వేలు స్కాలర్‌షిప్.. వెంటనే దరఖాస్తు చేస్కోండి!

2025-08-01 10:30:00

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. కేంద్రం, రాష్ట్రం కలిసి విద్యార్థుల ప్రతిభను వెలికితీసే విధంగా "విద్యార్థి విజ్ఞాన్ మంథన్" (VVM) పేరుతో ప్రతిభా పోటీలు నిర్వహించనున్నాయి. ఆరో తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థుల కోసం ఈ పోటీలు ఉంటాయి. ఇది ఒక online exam గా నిర్వహించబడుతుంది. విద్యార్థులు సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.200 మాత్రమే.

ఈ పరీక్షలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో జరుగుతాయి. జూనియర్ (6-8 తరగతులు), సీనియర్ (9-12 తరగతులు) విభాగాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు నగదు బహుమతులు, స్కాలర్‌షిప్‌లు ఇవ్వబడతాయి. జూనియర్ విభాగం పరీక్షలు అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు, సీనియర్ విభాగం పరీక్షలు నవంబర్ 19 నుంచి 23 వరకు ఉంటాయి. విద్యార్థులు వీలైన తేదీల్లో పరీక్ష రాయవచ్చు. సెప్టెంబర్ 1న మోడల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆగస్టు 16 నుంచి వీవీఎం వెబ్‌సైట్‌లో చదువుకోడానికి కావాల్సిన study material అందుబాటులో ఉంటుంది.

వీటి ఆధారంగా స్కూల్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి విద్యార్థులను ఎంపిక చేస్తారు. స్కూల్ స్థాయిలో 18 మంది, జిల్లా స్థాయిలో సబ్జెక్టుకు ముగ్గురు, రాష్ట్ర స్థాయిలో 20 మంది ఎంపిక చేస్తారు. వీరందరికీ ప్రశంసాపత్రాలు, ధ్రువపత్రాలు, జ్ఞాపికలు అందిస్తారు. రాష్ట్ర స్థాయిలో టాప్ 3 విద్యార్థులకు వరుసగా రూ.5,000, రూ.3,000, రూ.2,000 అందిస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి రూ.25,000 వరకు క్యాష్ బహుమతులు ఇవ్వబడతాయి.

అంతేకాదు, జాతీయ స్థాయిలో విజేతలకు ‘భాస్కరా స్కాలర్‌షిప్’గా నెలకు రూ.2,000 చొప్పున ఏడాది పాటు అందజేస్తారు. ఇది విద్యార్థులకు ఒక గొప్ప అవకాశంగా చెప్పొచ్చు. రీసెర్చ్ వైపు ఆసక్తి పెంచాలనుకునే విద్యార్థులు తప్పక ఈ పోటీలో పాల్గొనాలి. వారు వెంటనే వీవీఎం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Spotlight

Read More →