సింగపూర్ ప్రభుత్వం 2025లో వర్క్ పర్మిట్ విధానంలో కీలకమైన మార్పులను చేసింది. కొత్త నిబంధనలు అక్టోబర్ 2025 నుంచి పూర్తిగా అమల్లోకి రానున్నాయి. ఈ సంస్కరణల ద్వారా ప్రభుత్వం స్థానిక కార్మికులకు అవకాశాలు కల్పించడంతో పాటు విదేశీ కార్మికులను సమతుల్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా నిర్మాణం, మాన్యుఫాక్చరింగ్, సర్వీస్ రంగాల్లో ఈ మార్పులు పెద్ద ప్రభావం చూపనున్నాయి.
ఇంతవరకు విదేశీ కార్మికులు సింగపూర్‌లో 14 నుంచి 26 సంవత్సరాల వరకు మాత్రమే పనిచేయగలిగేవారు. కానీ ఇప్పుడు ఆ పరిమితిని పూర్తిగా తొలగించారు. యజమాని లేదా అర్హత కలిగిన కార్మికుడు ఎన్ని సంవత్సరాలు అయినా సింగపూర్‌లో పనిచేయవచ్చు. ఇది విదేశీ ఉద్యోగులకు గొప్ప అవకాశం అని చెప్పుకోవాలి. అనుభవజ్ఞులైన కార్మికులు దీని ద్వారా తమ సేవలను మరింత కాలం కొనసాగించగలరు.
వయస్సు పరిమితి పెంపు. ఇప్పటి వరకు వర్క్ పర్మిట్ హోల్డర్ల గరిష్ట వయస్సు 60 సంవత్సరాలు కాగా, ఇప్పుడు 63 సంవత్సరాలకు పెంచారు. కొత్త దరఖాస్తుదారులకు గరిష్ట వయస్సు 61 సంవత్సరాలు. దీని వల్ల అనుభవజ్ఞులు తమ నైపుణ్యాలను ఇంకా ఎక్కువ కాలం ఉపయోగించుకునే అవకాశం పొందుతారు.
అదేవిధంగా కంపెనీలు కనీస వేతనాల నియమాలను కచ్చితంగా పాటించాలి. మాన్యుఫాక్చరింగ్ నిర్మాణం మెరైన్ రంగాల్లో వేతనాలను పెంచారు. అలాగే విదేశీ ఉద్యోగులను నియమించుకునే ముందు స్థానిక సింగపూర్ పౌరులకు అవకాశం అనే ఇస్తున్నారు అని పత్రాలను చూపించాలి. దీని వల్ల స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కాపాడబడతాయి, కంపెనీల నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుంది.
అన్ని దరఖాస్తులు ఇప్పుడు పూర్తిగా డిజిటల్‌గా మారాయి. మినిస్ట్రీ ఆఫ్ మాన్పవర్ (MOM) అధికారిక పోర్టల్ ద్వారా యజమానులు ఆన్లైన్లోనే వర్క్ పర్మిట్ దరఖాస్తులు సమర్పించాలి. పాస్‌పోర్ట్, కాంట్రాక్ట్, అర్హత సర్టిఫికేట్లు, మెడికల్ రిపోర్ట్ వంటి పత్రాలు అప్లోడ్ చేయాలి. అన్ని పత్రాలు సరిగా ఉంటే కొన్ని రోజుల్లోనే అనుమతి లభిస్తుంది. ఆ తర్వాత ఫింగర్‌ప్రింట్ నమోదు చేసి, వర్క్ పర్మిట్ కార్డ్ పొందవచ్చు.
ఈ కొత్త మార్పుల వల్ల యజమానులకు కొన్ని అదనపు బాధ్యతలు వచ్చినా, కార్మికుల హక్కులు మరింత బలపడుతున్నాయి. వారికి మెరుగైన వేతనాలు, నివాస సౌకర్యాలు, ఆరోగ్య బీమా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొత్తంగా ఈ మార్పులు సింగపూర్‌లో విదేశీ మరియు స్థానిక కార్మికుల మధ్య న్యాయమైన సంబంధం ఏర్పడేందుకు దోహదం చేస్తాయి.