Crude oil: సౌదీని వెనక్కి నెట్టిన వెనెజులా.. యూఏఈ, రష్యాల టాప్ ప్లేస్: చమురు దిగుమతుల్లో ఆసక్తికర మార్పులు! భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా.. Gold Rate Today: అంతర్జాతీయ ఉద్రిక్తతలతో కమోడిటీ మార్కెట్ అతలాకుతలం: పసిడి పతనానికి గల కారణాలు ఇవే! CNG Price Hike: పెట్రోల్‌ను దాటేలా ఉందిగా... రెక్కలొచ్చిన సీఎన్‌జీ ధరలు! సామాన్యుడి గుండె గుభేల్! LPG: గ్యాస్ వినియోగదారులకు కొత్త రూల్... ఇక నుండి అవి ఉంటే ఎల్‌పీజీ రద్దు! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Gold Rates: పరుగు పెడుతున్న పసిడి... కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్న నేటి ధరలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! Crude oil: సౌదీని వెనక్కి నెట్టిన వెనెజులా.. యూఏఈ, రష్యాల టాప్ ప్లేస్: చమురు దిగుమతుల్లో ఆసక్తికర మార్పులు! భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా.. Gold Rate Today: అంతర్జాతీయ ఉద్రిక్తతలతో కమోడిటీ మార్కెట్ అతలాకుతలం: పసిడి పతనానికి గల కారణాలు ఇవే! CNG Price Hike: పెట్రోల్‌ను దాటేలా ఉందిగా... రెక్కలొచ్చిన సీఎన్‌జీ ధరలు! సామాన్యుడి గుండె గుభేల్! LPG: గ్యాస్ వినియోగదారులకు కొత్త రూల్... ఇక నుండి అవి ఉంటే ఎల్‌పీజీ రద్దు! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Gold Rates: పరుగు పెడుతున్న పసిడి... కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్న నేటి ధరలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్!

Trump: గ్రీన్ కార్డుదారులకు భారీ షాక్... పునః సమీక్ష! తేల్చి చెప్పేసిన ట్రంప్!

వాషింగ్టన్ డీసీలో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన వ్యక్తి ఇద్దరు నేషనల్ గార్డులపై కాల్పులు జరపడంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. సమస్య

Published : 2025-11-28 08:19:00

వాషింగ్టన్ డీసీలో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన వ్యక్తి ఇద్దరు నేషనల్ గార్డులపై కాల్పులు జరపడంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. సమస్యాత్మకంగా భావిస్తున్న దేశాల పౌరులకు ఇంతకుముందు జారీ చేసిన గ్రీన్ కార్డులన్నింటినీ తిరిగి పరిశీలించాలని ఆయన ఆదేశించారు. ఈ ఉత్తర్వులను వెంటనే USCIS కి పంపించారు.

వైట్ హౌస్ ఆదేశాల అనంతరం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. గ్రీన్ కార్డులు జారీ చేసే ప్రక్రియతో పాటు వాటిని తనిఖీ చేసే విధానాన్ని కూడా మరింత కఠినతరం చేసింది. ఈసారి పరిశీలనలు చాలా కఠినంగా ఉంటాయని డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో స్పష్టం చేశారు.

అలాగే, బైడెన్ ప్రభుత్వ కాలంలో ఆమోదం పొందిన అసైలమ్ కేసులన్నింటినీ కూడా తిరిగి సమీక్షిస్తామని USCIS ప్రకటించింది. సమస్యాత్మక దేశాల నుంచి వచ్చిన అసైలమ్ దరఖాస్తులను సరిగా పరిశీలించడంలో గత ప్రభుత్వంకి లోపాలున్నాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్‌లాఫ్లిన్ పేర్కొన్నారు.

ఈ మార్గదర్శకాలు వెంటనే అమల్లోకి వచ్చాయి. నవంబర్ 27న జరిగిన కాల్పుల రోజున లేదా ఆ తరువాత దాఖలైన అన్ని గ్రీన్ కార్డు దరఖాస్తులకు ఇవి వర్తిస్తాయి. అప్పటివరకు జారీ చేసిన కొన్ని వీసాలను కూడా రద్దు చేసే అవకాశముందని USCIS తెలిపింది.

ఈ పునఃసమీక్ష జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, బర్మా, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్, బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్‌మెనిస్తాన్, వెనిజులా వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాల పౌరుల గ్రీన్ కార్డులు మరియు దరఖాస్తులపై పూర్తి స్థాయి కఠిన పరిశీలన జరగనుంది.

Spotlight

Read More →