గత సంవత్సరం ఉగాది వేడుకల తో పోలాండ్ రాజధాని వార్సాలో ప్రారంభం అయిన పోలండ్ తేలుగు అసోసియేషన్ (PoTA) క్రమంగా ఇతర నగరాలకు విస్తరిస్తుంది. ఈ కొత్త సంవత్సరంలో మన తెలుగు వారికి అతి ముఖ్యమైన సంక్రాంతి పండుగ సంబరాలును పోలండ్ తేలుగు అసోసియేషన్(PoTA) Krakow Chapter వారు ఈ సారి Krakow నగరంలో 13-జనవరి న ఎంతో ఘనంగా నిర్వహించారు.
Krakow కోర్ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ అల్లూరి, సుమన్ కుమార్ జనగామ, దీక్షిత్ బసాని, అజిత్, మధుసూధన్ రెడ్డి, మౌనిక, అజయ్ గారి ఆధ్వర్యంలో మన సంస్కృతి, సాంప్రదాయాల విలువలను కాపాడుతూ, చిన్న పిల్లలకు మన పండుగ యొక్క ఆవశ్యకతను తెలుపుతూ బోగి పండ్లతో కార్యక్రమాలను మొదలు పెట్టారు. ఈ వేడుకలకు Krakow సిటీ లో ఉన్న తెలుగు వారు మాత్రమే కాకుండా వివిధ నగరాల నుంచి తెలుగు వారు హాజరు అయ్యయి ఈ కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చేలా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో ఎంతో ఆహ్లాదకరంగా గడిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో వాలంటీర్స్ శ్రీ హరి, విజయ్ రెడ్డి, ప్రవలిక మరియు హర్ష వారి వంతు సహాయ సహకారాలను అందించారు.
ఇందులో పాల్గొన్న చాలా మంది తెలుగు వారు PoTA చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు, అత్యవసర పరిస్థితులలో వారు అందిస్తున్న సహాయ సహకారాలను అభినందిస్తూ, ఇలాగే కొనసాగించాలని వారి ఆకాంక్షను తెలిపారు. PoTA స్థాపించిన తరువాత పోలాండ్ లో వారికి మంచి భరోసా ఉంది అని, ధైర్యంగాఉన్నాము అని తెలిపారు.