NRI యాష్ 7 గం. పైగా సిఐడి వేదింపులు? 32 ప్రశ్నలు! 4 కేసులు! మళ్లీ ఫిబ్రవరి 2న! తీవ్ర ఆందోళనలు

ఎన్నారై బొద్దులూరి యశస్వి ను ఇవాళ మరొక సారి విచారణ కు పిలిచారు. గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణ జరిగింది. యష్ ను కలిసేందుకు ఎంతో మంది తెలుగు యువత అక్క

Published : 2024-01-24 19:25:00

ఎన్నారై బొద్దులూరి యశస్వి ను ఇవాళ మరొక సారి విచారణ కు పిలిచారు. గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణ జరిగింది. యష్ ను కలిసేందుకు ఎంతో మంది తెలుగు యువత అక్కడికి వచ్చారు. పోలీసులు వారు ఎవరికి అనుమతి ఇవ్వకపోవడం తో అక్కడ వాగ్వాదం జరిగింది. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని అభియోగం మోపి గత కొద్ది రోజులు గా పోలీసులు యశస్విను బాగా ఇబ్బంది పెడుతున్నారు అని యువత మండిపడ్డారు.

గతంలో సీఐడీ వారు యశస్విని అదుపులోకి తీసుకుని 41ఏ నోటీసు ఇచ్చి విడిచిపెట్టారు. ఆ తరువాత కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. గత ఏడాది డిసెంబర్ 23న సీఐడీ యశస్వికి లుకౌట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 11 న తిరుపతి లో ఒక సారి విచారణ జరిగింది. ఆ విచారణ లో వారు అడిగిన అన్నీ ప్రశ్నలకు యశస్వి ఓపికగా జవాబు చెప్పారు. ఇవాళ మరొక సారి విచారణ కు పిలవడం తో హాజరు అయ్యారు. యశస్వి కి కనీసం భోజనం కూడా అనుమతించలేదు అని యువత పోలీసులతో గొడవ పడ్డారు. సీఐడీ కార్యాలయం వద్ద నుంచి అందరూ వెళ్లిపోవాలి అని పోలీసులు లేదంటే ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామని పోలీసులు హెచ్చరించారు అని అక్కడికి వెళ్ళిన వారు తెలిపారు. విచారణ పేరుతో యశస్విని వేధిస్తున్నారని తెలుగు యువత ఆరోపణ చేశారు.

విచారణ ముగిసిన తర్వాత యశస్వి బయటకు వచ్చి మీడియా తో మాట్లాడారు. అధికారులు అడిగిన 32 ప్రశ్నలకు సమాధానం చెప్పాను అని. ఫిబ్రవరి 2న విజయవాడ ఆఫీసుకు రావాలని సిబిఐ చెప్పినట్లు, కొన్ని వీడియోలు చూపించి వాటి గురించి అడిగారు అని, తనపై మొత్తం 4 కేసులు పెట్టారు అని యశస్వి తెలిపారు. విచారణ లో తిరుపతి నుంచి వచ్చిన అధికారులు కూడా ఉన్నారు అని, విచారణ అనంతరం సంతకాలు సేకరించారు అని లాయర్ కోటేశ్వరరావు తెలిపారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు యశస్వి కి ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది అని, ఈ ప్రభుత్వంలో తప్పు చేసినా అడిగే వాడు లేడు అని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

మీ  వ్యాపార  ప్రకటనల  కొరకు  ఆంధ్ర ప్రవాసి  డాట్  కామ్  AndhraPravasi.com  ఉచితంగా  అందిస్తున్న  క్లాసిఫైడ్స్  Classifieds  లో  ప్రకటించుకొని  మీ  వ్యాపారాన్ని  అభివృధ్ది చేసుకోండి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →