Railway Jobs: పదవ తరగతి అర్హతతో రైల్వే ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు... వెంటనే అప్లై చేసుకోండి! APSRTC Recruitment: ఏపీఎస్‌ఆర్‌టీసీ భారీ నోటిఫికేషన్‌..! రాత పరీక్ష లేదు..! మెరిట్‌ ఆధారంగా ఎంపిక..! యువతకు రైల్వేలో మెగా ఛాన్స్.. పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగం! చివరి తేదీ.. DRDO Recruitment: డీఆర్డీఓ 2025 అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్! నెలకు ₹12,300 జీతం, 50 పోస్టులు! Railway Jobs: పదవ తరగతి అర్హతతో రైల్వే ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు... వెంటనే అప్లై చేసుకోండి! APSRTC Recruitment: ఏపీఎస్‌ఆర్‌టీసీ భారీ నోటిఫికేషన్‌..! రాత పరీక్ష లేదు..! మెరిట్‌ ఆధారంగా ఎంపిక..! యువతకు రైల్వేలో మెగా ఛాన్స్.. పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగం! చివరి తేదీ.. DRDO Recruitment: డీఆర్డీఓ 2025 అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్! నెలకు ₹12,300 జీతం, 50 పోస్టులు!

Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..!

2025-11-05 13:04:00
రూ. 30కే 100 కి.మీ మైలేజ్.. EMIలో నెలకు రూ.1,700కే ఇంటికి తెచ్చుకోండి! ధర.. ఫీచర్లు ఇవే!

టెక్‌ ప్రపంచంలో మరో సెన్సేషన్‌ సృష్టించిన గూగుల్‌, తన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) విభాగాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లే ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ‘ప్రాజెక్ట్‌ సన్‌క్యాచర్‌’ అనే ఈ వినూత్న ప్రయోగం ద్వారా గూగుల్‌ భూమికి వెలుపలే డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలనే మిషన్‌ను ప్రారంభించింది. సౌరశక్తితో నడిచే ఉపగ్రహాలను ఆధారంగా చేసుకుని ఏఐ ప్రాసెసింగ్‌ను అంతరిక్షంలో నిర్వహించాలన్న గూగుల్‌ ఆలోచన ప్రపంచ టెక్‌ రంగంలో చర్చనీయాంశంగా మారింది. సంస్థ ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌ భవిష్యత్తులో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని విపరీతంగా పెంచి, పర్యావరణానికి భారం కాకుండా కొత్త దిశను చూపనుంది.

Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు!

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా గూగుల్‌ తన అత్యాధునిక టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లు (TPUs) అంతరిక్షంలో అమర్చనుంది. చిన్న పరిమాణంలో ఉన్న సౌరశక్తి ఆధారిత ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టి, వాటిని ఫ్రీ-స్పేస్ ఆప్టికల్ లింక్స్‌ ద్వారా పరస్పరంగా అనుసంధానించనుంది. ఈ విధంగా ఏర్పడే ఉపగ్రహ సమూహం ఏఐ డేటా సెంటర్‌లుగా పనిచేయనుంది. ఈ ప్రాజెక్ట్‌కు ‘ప్లానెట్‌’ అనే ఉపగ్రహ సాంకేతిక సంస్థ భాగస్వామ్యమవుతోంది. 2027 నాటికి తొలి రెండు ప్రయోగాత్మక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడమే గూగుల్‌ తదుపరి లక్ష్యమని సీఈఓ సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు.

చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్!

"మా టీపీయూలు ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్తున్నాయి" అని పిచాయ్‌ తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్, ఆటోనమస్ డ్రైవింగ్ వంటి తమ మూన్‌షాట్ ప్రాజెక్టుల మాదిరిగానే, ‘సన్‌క్యాచర్‌’ కూడా భవిష్యత్తు సాంకేతికతలో విప్లవాత్మక మార్పుకు దారి తీస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతరిక్షంలో సౌరశక్తిని పూర్తిగా వినియోగించి, నిరంతర విద్యుత్‌ సరఫరాతో ఏఐ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగుతాయని గూగుల్‌ భావిస్తోంది. భూమిపై పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలు, పర్యావరణ దుష్ప్రభావాలను తగ్గించడమే ఈ ప్రాజెక్ట్‌ వెనుక ప్రధాన ఉద్దేశ్యం. భూమి కక్ష్యలో ఉన్న సోలార్‌ ప్యానెల్లు భూమిపైనివాటితో పోలిస్తే ఎనిమిది రెట్లు ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయగలవని గూగుల్‌ తెలిపింది.

Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక!

అయితే ఈ ప్రాజెక్ట్‌లో అనేక సాంకేతిక సవాళ్లు ఉన్నాయని సంస్థ అంగీకరించింది. ముఖ్యంగా రేడియేషన్‌, థర్మల్‌ మేనేజ్‌మెంట్‌, సిస్టమ్‌ విశ్వసనీయత వంటి అంశాల్లో భూమిపై ఉన్న సదుపాయాలకంటే అంతరిక్షంలో పరిస్థితులు విభిన్నంగా ఉంటాయని తెలిపింది. అయినప్పటికీ, తమ తాజా ట్రిలియం జనరేషన్‌ టీపీయూలు అంతరిక్ష రేడియేషన్‌ను తట్టుకోగలవని పరీక్షల్లో నిరూపించుకున్నట్లు వెల్లడించింది. గూగుల్‌ విశ్లేషణ ప్రకారం, భవిష్యత్తులో ఏఐ ఆధారిత వ్యవస్థల శక్తి వినియోగాన్ని సుస్థిరంగా ఉంచాలంటే అంతరిక్ష డేటా సెంటర్‌లు ఉత్తమ పరిష్కారంగా నిలుస్తాయి. ఈ దిశగా గూగుల్‌ ఇప్పటికే విస్తృత పరిశోధనలను ప్రారంభించి, అంతరిక్షంలో ఏఐ విప్లవానికి నాంది పలుకుతోంది.

ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం!
Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది?
Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి!
ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు!
NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!!
District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా...

Spotlight

Read More →