Indian Railway : భారతదేశంలో మొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్! విమాన సౌకర్యాలతో రైలు ప్రయాణం అనుభవం! ఇన్ని సౌకర్యాల?

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను మంగళవారం రాత్రి కాకినాడ – మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. తీరాన్ని తాకిన తర్వాత ఇది బలమైన తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను కారణంగా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారగా, ఉధృతమైన ఈదురుగాలులతో చెట్లు నేలకూలాయి. ముఖ్యంగా కాకినాడ, విశాఖ, రాజమండ్రి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Pollution: లాహోర్‌ గ్యాస్‌ ఛాంబర్‌గా మారింది..! ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా రికార్డు..!

తుపాను ప్రభావం కారణంగా రాబోయే 24 గంటల్లో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలతో పాటు తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో 233 మండలాల్లో 1419 గ్రామాలు, 44 పట్టణాల్లో తుపాను ప్రభావం ఉంటుందని అంచనా వేసి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.

Cyclone : తుపాన్ ప్రభావం తగ్గే వరకు రైళ్లు నిలిపివేత.. భద్రత కోసం ముందస్తు చర్యలు.. భువనేశ్వర్, విశాఖ, గుంటూరు రైళ్లు రద్దు!

ప్రజల భద్రత కోసం అధికారులు 2,000కు పైగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విశాఖ, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన చోట తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పునరావాస కేంద్రాలు సిద్ధం చేసి, అవసరమైతే బయటకు రావొద్దని ప్రజలకు సూచనలు ఇచ్చారు. కంట్రోల్ రూమ్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచారు.

ఎండిన నిమ్మకాయల మ్యాజిక్.. వంటింట్లోని 6 సమస్యలకు ఇలా చెక్ పెట్టండి.. పారేస్తే నష్టమే!

తుపాను కారణంగా రైల్వే రవాణాపైనా తీవ్ర ప్రభావం పడింది. అక్టోబర్ 27 నుండి 29 వరకు మొత్తం 100కి పైగా రైళ్లు రద్దు చేశారు. ముఖ్యంగా గోదావరి ఎక్స్‌ప్రెస్, ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు నిలిపివేయబడ్డాయి. వాతావరణ శాఖ కాకినాడ తీరానికి 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. తీరప్రాంత ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని అధికారులు హెచ్చరించారు.

Cyclone Montha hits: కాకినాడ మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిన మొంథా తుఫాన్.. అధికారులు అలెర్ట్‌!

ప్రస్తుతం మొంథా తుపాను బలహీన పడుతున్నప్పటికీ, దాని ప్రభావం మరోరోజు పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. తుపాను ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ, ఆకస్మిక వరదలు, చెట్లు కూలడం, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలకు ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజలు అవసరం లేని ప్రయాణాలు మానుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు.

త్వరపడండి.. హోమ్ ఆఫీస్, స్టార్టప్‌లకు ది బెస్ట్! ఇకపై వై-ఫై రూటర్ కొనే పనిలేదు - అతి తక్కువ ధరలో.!
SGB ఇన్వెస్టర్లకు ఆర్బీఐ గోల్డెన్ గిఫ్ట్..! ఐదేళ్లలోనే పెట్టుబడి విలువ మూడు రెట్లు..!
Health Care: బరువు తగ్గాలని ఉందా? ఉదయం పూట ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే కష్టమే!
Chandrababu: సీఎం చంద్రబాబు కీలక సమీక్ష! రెండు కొత్త జిల్లాలతో పాటు నాలుగు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదన!
చలికాలం వచ్చేసింది.. ఫ్లిప్‌కార్ట్‌లో గీజర్ ఆఫర్లు.. అసలు ధరలో సగం ధరకే 15 లీటర్ల గీజర్!