TDP NewZealand: ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం... న్యూజిలాండ్‌లో ఘనంగా జరుపుకున్న టీడీపీ ఎన్నారైలు! CBN: ప్రవాసులతో సీఎం చంద్రబాబు ఫోటో సెషన్! ఆయన ఓపికకు ఫిదా అయిన ప్రవాసులు! AP Government: ఏపీ ప్రభుత్వం మరో పథకం! ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు... అర్హతలు ఇవే! మ్యూనిక్‌లో ఘనంగా శ్రీవారి కళ్యాణోత్సవం! TTD మరియు TAG సంయుక్త సహకారంతో ఆధ్యాత్మిక వేడుక! గల్ఫ్ నుంచి స్వదేశీ ప్రయాణానికి ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న శవం! సహాయం కోసం 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' ని ఆశ్రయించిన మృతుడి సోదరుడు! TDP NewZealand: ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం... న్యూజిలాండ్‌లో ఘనంగా జరుపుకున్న టీడీపీ ఎన్నారైలు! CBN: ప్రవాసులతో సీఎం చంద్రబాబు ఫోటో సెషన్! ఆయన ఓపికకు ఫిదా అయిన ప్రవాసులు! AP Government: ఏపీ ప్రభుత్వం మరో పథకం! ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు... అర్హతలు ఇవే! మ్యూనిక్‌లో ఘనంగా శ్రీవారి కళ్యాణోత్సవం! TTD మరియు TAG సంయుక్త సహకారంతో ఆధ్యాత్మిక వేడుక! గల్ఫ్ నుంచి స్వదేశీ ప్రయాణానికి ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న శవం! సహాయం కోసం 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' ని ఆశ్రయించిన మృతుడి సోదరుడు!

బహరేన్‌లో ఐదేళ్లుగా గల్ఫ్ కార్మికుడి మృతదేహం – అంత్యక్రియలకు ఏర్పాట్లు! అక్కడే సాంప్రదాయబద్ధంగా..

2025-11-04 21:00:00
Rural Development: గ్రామీణ రహదారుల అభివృద్ధి నాణ్యతపై పవన్ కళ్యాణ్ కఠిన హెచ్చరిక!!

జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణానికి చెందిన గల్ఫ్ కార్మికుడు శ్రీపాద నరేష్ ఐదేళ్ల క్రితం బహరేన్‌లో మృతి చెందగా, ఆయన మృతదేహం అక్కడి అతిశీతల శవాగారంలో ఇప్పటివరకు నిల్వ ఉంది. మృతదేహాన్ని భారతదేశానికి తరలించడం సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాదని బహరేన్‌లోని భారత రాయబార కార్యాలయం స్పష్టంచేసింది.

Job: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టుల నోటిఫికేషన్ విడుదల — నవంబర్ 23 వరకు దరఖాస్తు!!

దీంతో బహరేన్‌లోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు సమ్మతిస్తూ, మృతుని భార్య శ్రీపాద లత (మునికోట నాగమణి) నోటరీ అఫిడవిట్ (నిరభ్యంతర పత్రం) పై సంతకం చేశారు. తదుపరి చర్యల కోసం కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, సీఎం ప్రవాసీ ప్రజావాణి కార్యాలయాన్ని సందర్శించి, మృతుని సోదరుడు ధర్మపురి ఆనంద్ తో కలిసి అఫిడవిట్ పత్రాన్ని ప్రజావాణి ఇన్‌చార్జి డా. జి. చిన్నారెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి వారికి అందజేశారు. 

Morning Wellness Secret: నెయ్యితో రోజును రీసెట్ చేసుకోండి — ఇది అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్!

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, “బహరేన్‌లోని భారత రాయబార కార్యాలయంతో తెలంగాణ ప్రభుత్వం సమన్వయం చేసుకొని, అక్కడే సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను” అన్నారు. మృతుడి సోదరుడు ధర్మపురి ఆనంద్ బహరేన్‌కి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.

Free three-wheeler : దివ్యాంగులకు ప్రభుత్వ శుభవార్త.. ఉచితంగా 1,750 త్రీవీలర్ మోటార్ సైకిళ్లు!

ఈ కార్యక్రమంలో ఎన్నారై అడ్వైజరీ కమిటీ సభ్యులు నంగి దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, సామాజిక సేవకులు మొరపు తేజ, ఆకుల ప్రవీణ్, బొజ్జ అమరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బహరేన్‌లోని సామాజిక కార్యకర్తలు డి.వి. శివకుమార్, కోటగిరి నవీన్ కుమార్, నోముల మురళి భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తూ, అంత్యక్రియలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.

PAN Card: ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌! లాస్ట్ డేట్ ఎప్పుడంటే!
Sea bathing banned: కార్తీక దీపోత్సవం సందర్భంగా సముద్ర స్నానాలకు నిషేధం.. నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక!
US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్!
ప్రకృతి ప్రళయం... 9 సెం.మీ. సైజు వడగళ్ళు వాన! పలువురికి తీవ్ర గాయాలు!
Baahubali Epic: రాజమౌళి బాహుబలి ది ఎపిక్ బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాలు.. మొదటి వారాంతంలో ఘన వసూళ్లు!
1980 murder case: 1980 హత్య కేసులో తప్పుగా శిక్ష.. 43 ఏళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడ్డ భారత సంతతి వ్యక్తి!

Spotlight

Read More →