Karthika Pournami: కార్తీక పౌర్ణమి 2025 శివ–కేశవుల ఆరాధనకు విశిష్ట దినం, తిథి పూజ సమయాలు ఇలా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొంథా తుఫాన్ ప్రభావం క్రమంగా తగ్గిపోతుండగా, ప్రభుత్వం యంత్రాంగం తక్షణ చర్యలతో నష్టం తగ్గించడంలో విజయవంతమైందని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన నష్టం, రక్షణ చర్యల పురోగతి, పునరుద్ధరణ కార్యక్రమాలపై సమీక్ష జరిపారు.

FolkSinger: ఫోక్ సింగర్ కు బంపర్ ఆఫర్! తమిళ చిత్రసీమలో హీరోయిన్ గా ఎంట్రీ!

“మొంథా తుఫాన్ తీరం దాటిపోయింది. మధ్యాహ్నానికి పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వస్తాయి” అని సీఎం తెలిపారు. తుఫాన్ కారణంగా దురదృష్టవశాత్తూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. ఇందుకోసం 10,000 మందిని పూర్తిస్థాయిలో రంగంలోకి దింపినట్లు తెలిపారు.

రెడ్ అలర్ట్.. శ్రీకాకుళం జిల్లాలో మోంథా బీభత్సం.. భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన బాహుదా నది!

అంతేకాకుండా, ఎన్‌డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది సమర్థంగా స్పందించి ప్రజలను రక్షించారని, వారికి అభినందనలు తెలిపారు. “మన చర్యల వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. క్రమశిక్షణతో, సమర్థతతో పని చేస్తే ఏ విపత్తునైనా ఎదుర్కొనగలం” అని సీఎం అభిప్రాయపడ్డారు.

పుట్టబోయే పిల్లల కోసం రెడీ.. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. తల్లి ప్రేమ చూపుతూ!

టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, “మనం టీమ్‌గా పనిచేశాం. ప్రతిఒక్కరూ అంకితభావంతో పని చేశారు. మీ అందరికీ నా అభినందనలు. మరో రెండు రోజులు ఇలాగే కృషి చేస్తే ప్రజలకు పూర్తి ఊరట కలిగించవచ్చు” అని అన్నారు.

Bharat Electronics: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో భారీ నియామకాలు.. ఇంజినీర్లకు బంగారు అవకాశం!

మంత్రులు, అధికారులు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని, ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు. “ప్రభుత్వం చేసిన పనిని ప్రజలకు వివరించండి. ప్రతి ఇల్లు, ప్రతి గ్రామం స్థాయిలో నష్టం అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించండి” అని సూచించారు.

Annacanteen: పునరావాస కేంద్రాల్లో బాధితులకు భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్‌ నెట్‌వర్క్‌!

అలాగే, వ్యవసాయ, విద్యుత్, రహదారి, గృహ నిర్మాణ, త్రాగునీటి శాఖలు సమన్వయంగా పనిచేయాలని, తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని త్వరగా పూడ్చే చర్యలు చేపట్టాలని సూచించారు. చంద్రబాబు స్పష్టం చేశారు – “ప్రజల ప్రాణాలు కాపాడటమే మా మొదటి బాధ్యత. ప్రతి కుటుంబం తిరిగి సాధారణ జీవితంలోకి చేరే వరకు ప్రభుత్వం ప్రజల పక్కన ఉంటుంది.”

Data leak: డేటా లీక్.. వెంటనే పాస్వర్డ్స్ మార్చుకోండి.. డిజిటల్ నిర్లక్ష్యం ఒక్క క్షణం!

రాష్ట్రవ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండి, పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. తుఫాన్ తర్వాత పరిస్థితులు క్రమంగా సాధారణమవుతుండగా, ప్రభుత్వం తక్షణ స్పందనతో నష్టం తగ్గించడంలో సఫలమైందని అధికారులు తెలిపారు.

H1B Visa ఫీజు వ్యవహారంలో అనూహ్య మలుపు! చేతులెత్తేసిన ఐటీ కంపెనీలు!
Government Jobs: ఏపీలో వారందరికి ప్రభుత్వ ఉద్యోగాలు..! జీవో 1207 నియామకాలకు సుప్రీంకోర్టు ఆమోదం..!
Pawankalyan: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం! ఆ జిల్లాకు భారీ నిధుల విడుదల... ఆ ప్రాంతానికి మహర్దశ!
Pollution: లాహోర్‌ గ్యాస్‌ ఛాంబర్‌గా మారింది..! ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా రికార్డు..!
Cyclone : తుపాన్ ప్రభావం తగ్గే వరకు రైళ్లు నిలిపివేత.. భద్రత కోసం ముందస్తు చర్యలు.. భువనేశ్వర్, విశాఖ, గుంటూరు రైళ్లు రద్దు!
ఎండిన నిమ్మకాయల మ్యాజిక్.. వంటింట్లోని 6 సమస్యలకు ఇలా చెక్ పెట్టండి.. పారేస్తే నష్టమే!