రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్.. టీమిండియాను ఆరంభం నుంచే ఒత్తిడిలోకి నెట్టింది. తాజా సమాచారం అందే సమయానికి భారత్ 26.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ (24), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. అయితే రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు ఎక్కువసేపు నిలవలేకపోయారు. మరోవైపు, శుభ్‌మన్ గిల్ 53 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56 పరుగులు చేసి జేమీసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఆ తర్వాత కివీస్ బౌలర్ క్రిస్టియన్ క్లార్క్ విజృంభించాడు. శ్రేయస్ అయ్యర్ (8), విరాట్ కోహ్లీ (23)లను స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు పంపి భారత్‌ను గట్టి దెబ్బతీశాడు. క్లార్క్ తన స్పెల్‌లో మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ 118 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (4), రవీంద్ర జడేజా (6) ఉన్నారు. వీరిద్దరూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
రెండో వన్డే - తడబడిన టీమిండియా... 118 పరుగులకే 4 వికెట్లు డౌన్.. ఓపెనర్లు శుభారంభం అందించినా.!