Indian Railway : భారతదేశంలో మొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్! విమాన సౌకర్యాలతో రైలు ప్రయాణం అనుభవం! ఇన్ని సౌకర్యాల?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ కాలంలో జరిగిన జిల్లాల విభజనలో శాస్త్రీయత లేకపోవడంతో, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ప్రజల అభిప్రాయాలు, ఎన్నికల హామీలను పరిగణనలోకి తీసుకుని పరిపాలన మరింత సులభతరం చేయడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి సీఎం సమీక్షకు సమర్పించింది.

BSNL యూజర్లకు గుడ్ న్యూస్! రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు మరింత చౌకగా... అపరిమిత కాల్స్‌తో అదిరిపోయే ఆఫర్!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో మంగళవారం ఈ అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల విభజన, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, మండలాల సరిహద్దులు, పేర్ల మార్పులు వంటి అంశాలపై ఉపసంఘ సభ్యులతో సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు పి. నారాయణ, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోరికలను ప్రతిబింబించేలా, భవిష్యత్తులో ఎలాంటి పరిపాలనా ఇబ్బందులు లేకుండా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగాలని సీఎం ఆదేశించారు.

Pollution: లాహోర్‌ గ్యాస్‌ ఛాంబర్‌గా మారింది..! ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా రికార్డు..!

ఉపసంఘం సిద్ధం చేసిన నివేదిక ప్రకారం, మార్కాపురం మరియు మదనపల్లె కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే, పుంగనూరు లేదా పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర కేంద్రాలుగా నాలుగు కొత్త రెవెన్యూ డివిజన్లు సృష్టించాలనే సూచన చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లను తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని కూడా నివేదికలో పేర్కొన్నారు. ఈ మార్పులు గతంలో జరిగిన అశాస్త్రీయ విభజన వల్ల ఏర్పడిన సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Coffee Powder: బంగారం కంటే వేగంగా పెరుగుతున్న కాఫీ ధర! కారణం ఇదేనేమో!

ఇక రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా, మార్కాపురం జిల్లాలో గిద్దలూరు కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో మార్కాపురం జిల్లాలో మూడు డివిజన్లు ఉండే అవకాశముంది. ప్రకాశం జిల్లాలో అద్దంకి డివిజన్ ఏర్పాటు, బాపట్ల, నెల్లూరు జిల్లాల పరిధిలోని కొన్ని నియోజకవర్గాల మార్పులు కూడా ప్రతిపాదనలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని నగరి డివిజన్‌ను తిరుపతి జిల్లాలో చేర్చాలని సూచించారు. ఈ మార్పులు పరిపాలనలో సమర్థత పెంచుతాయని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

Cyclone : తుపాన్ ప్రభావం తగ్గే వరకు రైళ్లు నిలిపివేత.. భద్రత కోసం ముందస్తు చర్యలు.. భువనేశ్వర్, విశాఖ, గుంటూరు రైళ్లు రద్దు!

ఉపసంఘం అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించి మరోసారి సమావేశమై తుది నివేదికను సిద్ధం చేయనుంది. ఈ నివేదికను వారంలోపు సీఎం సమీక్షించనున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పాటు భవిష్యత్తులో జరిగే నియోజకవర్గాల పునర్విభజనను కూడా పరిగణనలోకి తీసుకుని మార్పులు చేయనున్నారు. ప్రజల కోరికలు, ఎన్నికల హామీలు, పరిపాలనా సౌలభ్యం … ఈ మూడు అంశాలను సమన్వయపరుస్తూ కొత్త జిల్లాల రూపకల్పనకు ప్రభుత్వం ముందడుగు వేసింది.

ఎండిన నిమ్మకాయల మ్యాజిక్.. వంటింట్లోని 6 సమస్యలకు ఇలా చెక్ పెట్టండి.. పారేస్తే నష్టమే!
Cyclone Montha hits: కాకినాడ మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిన మొంథా తుఫాన్.. అధికారులు అలెర్ట్‌!
త్వరపడండి.. హోమ్ ఆఫీస్, స్టార్టప్‌లకు ది బెస్ట్! ఇకపై వై-ఫై రూటర్ కొనే పనిలేదు - అతి తక్కువ ధరలో.!
SGB ఇన్వెస్టర్లకు ఆర్బీఐ గోల్డెన్ గిఫ్ట్..! ఐదేళ్లలోనే పెట్టుబడి విలువ మూడు రెట్లు..!
Health Care: బరువు తగ్గాలని ఉందా? ఉదయం పూట ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే కష్టమే!