Chandrababu: పుట్టపర్తిలో 'గ్రామీణ డాక్ సేవక్' సమ్మేళనం.. హాజరైన సీఎం,కేంద్రమంత్రులు! పాలకొల్లులో రూ.4.43 కోట్ల పనులకు శంకుస్థాపన.. High-Speed Metro: దేశంలోనే తొలి హై-స్పీడ్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ! Konidela Village: కొణిదెల గ్రామంలో అభివృద్ధి జాతర.. రూ. 6 కోట్లతో మారుతున్న రూపురేఖలు! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Visakapatnam Steel Plant: విశాఖ ఉక్కు డైరెక్టర్ రాజీనామా.. ఉన్నతాధికారుల మధ్య భగ్గుమన్న విభేదాలు! Israeli Airstrikes: లెబనాన్‌లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు! Elevated Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్... 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! డీపీఆర్ సిద్ధం.... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! Chandrababu: పుట్టపర్తిలో 'గ్రామీణ డాక్ సేవక్' సమ్మేళనం.. హాజరైన సీఎం,కేంద్రమంత్రులు! పాలకొల్లులో రూ.4.43 కోట్ల పనులకు శంకుస్థాపన.. High-Speed Metro: దేశంలోనే తొలి హై-స్పీడ్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ! Konidela Village: కొణిదెల గ్రామంలో అభివృద్ధి జాతర.. రూ. 6 కోట్లతో మారుతున్న రూపురేఖలు! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Visakapatnam Steel Plant: విశాఖ ఉక్కు డైరెక్టర్ రాజీనామా.. ఉన్నతాధికారుల మధ్య భగ్గుమన్న విభేదాలు! Israeli Airstrikes: లెబనాన్‌లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు! Elevated Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్... 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! డీపీఆర్ సిద్ధం.... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'!

Modi Speech: ఘనంగా అంతర్జాతీయ ఏఐ సదస్సు.. సమ్మిట్ లో ప్రధాని మోడీ వ్యాఖ్యలు!

AI Summit Modi Speech: న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇటీవల ముగిసిన 'ఏఐ ఇంపాక్ట్' సదస్సుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. దీని ద్వారా కృత్రిమ మేధ రంగంలో భారతదేశ అద్భుతమైన సామర్థ్యాలను ప్రపంచానికి చూపించామని అన్నారు.

Published : 2026-02-22 14:16:00
  • సైబర్ నేరాల పట్ల హెచ్చరిక జారీ చేసిన నరేంద్ర మోదీ..
  • 10 నెలల చిన్నారి అవయవదానానికి ముందుకు వచ్చిన తల్లిదండ్రులకు ప్రశంసలు..

AI Summit Modi Speech: న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇటీవల ముగిసిన 'ఏఐ ఇంపాక్ట్' సదస్సుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. దీని ద్వారా కృత్రిమ మేధ రంగంలో భారతదేశ అద్భుతమైన సామర్థ్యాలను ప్రపంచానికి చూపించామని అన్నారు. ఆదివారం 131వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన ఈ సదస్సు ప్రపంచ దేశాలను ఆకర్షించిందని అన్నారు.

ఈ సదస్సులో ముఖ్యంగా మన రెండు ఆవిష్కరణలు ప్రపంచ నేతలను ఆశ్చర్యపరిచాయని తెలిపారు. జంతువుల చికిత్సకు వాటిని ట్రాక్ చేయడానికి 'ఏఐ'ని ఉపయోగించడం, భారత పురాతన గ్రంథాలు, జ్ఞానాన్ని సంరక్షించడానికి ఏఐను ఉపయోగించడం చూసి ప్రపంచ నేతలు ప్రశంసించారని అన్నారు. నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, స్టార్టప్ రంగాలకు చెందిన వారు ఈ సదస్సుకు హాజరయ్యారని తెలిపారు.

కృత్రిమ మేధ, అంతరిక్ష పరిశోధన, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ సహా అభివృద్ధి చెందుతోన్న సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగిస్తూ భారత్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. మన యువత ఆవిష్కరణలతో దేశ కీర్తిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే శక్తిని కలిగి ఉందని అన్నారు. ఈ సదస్సు ద్వారా మన యువత ప్రతిభను ప్రపంచానికి చూపించగలిగామని అన్నారు. 

సైబర్ నేరాలపై హెచ్చరిక
సైబర్ నేరాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. డిజిటల్ అరెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

కాగా, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేరళకు చెందిన 10 నెలల చిన్నారి అలిన్ షెరిన్ అవయవదానానికి ముందుకు వచ్చిన తల్లిదండ్రులను ప్రధాని మోదీ ప్రశంసించారు. బిడ్డను కోల్పోయిన బాధలోనూ వారు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. వారి నిర్ణయం నలుగురికి జీవనదాతగా మారిందని పేర్కొన్నారు.

Spotlight

Read More →