Amaravati Updates: పది రోజుల్లోనే అద్భుత మార్పు.. E2 రోడ్డుతో మారనున్న రాజధాని రూపురేఖలు.. Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం..! నెయ్యి సేకరణలో భారీ మార్పులు! AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్..! ప్రభుత్వమే నేరుగా కొనుగోలు... సర్కార్ కీలక నిర్ణయం! Municipal Chairman: ముగిసిన న్యాయపోరాటం..! ఇబ్రహీంపట్నం చైర్మన్ పదవిపై హైకోర్టు క్లారిటీ...! AP Elections: ఏపీ పోలింగ్ ‘మిరాకిల్’ వివాదం..! పరకాల ఆరోపణల్లో నిజం ఎంత? Mulapeta Port: ఉత్తరాంధ్ర అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్...! భవిష్యత్తు వాణిజ్య కేంద్రంగా మూలపేట..! Madanapalle Case: మదనపల్లె చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్...! కీలక నిందితుడి మృతి! Health Department: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...! ప్రభుత్వ వైద్యులకు భారీగా పదోన్నతులు! Ap Government: ఏపీ పేదలకు బంపర్ ఆఫర్...! మీ అకౌంట్లో రూ. 2.50 లక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! CantileverBridge: మంగళగిరి-తెనాలి రోడ్డుకు మెగా అప్‌గ్రేడ్! ₹16.93 కోట్లతో అత్యాధునిక కాంటిలివర్ బ్రిడ్జ్…! Amaravati Updates: పది రోజుల్లోనే అద్భుత మార్పు.. E2 రోడ్డుతో మారనున్న రాజధాని రూపురేఖలు.. Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం..! నెయ్యి సేకరణలో భారీ మార్పులు! AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్..! ప్రభుత్వమే నేరుగా కొనుగోలు... సర్కార్ కీలక నిర్ణయం! Municipal Chairman: ముగిసిన న్యాయపోరాటం..! ఇబ్రహీంపట్నం చైర్మన్ పదవిపై హైకోర్టు క్లారిటీ...! AP Elections: ఏపీ పోలింగ్ ‘మిరాకిల్’ వివాదం..! పరకాల ఆరోపణల్లో నిజం ఎంత? Mulapeta Port: ఉత్తరాంధ్ర అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్...! భవిష్యత్తు వాణిజ్య కేంద్రంగా మూలపేట..! Madanapalle Case: మదనపల్లె చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్...! కీలక నిందితుడి మృతి! Health Department: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...! ప్రభుత్వ వైద్యులకు భారీగా పదోన్నతులు! Ap Government: ఏపీ పేదలకు బంపర్ ఆఫర్...! మీ అకౌంట్లో రూ. 2.50 లక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! CantileverBridge: మంగళగిరి-తెనాలి రోడ్డుకు మెగా అప్‌గ్రేడ్! ₹16.93 కోట్లతో అత్యాధునిక కాంటిలివర్ బ్రిడ్జ్…!

Chandrababu Meeting: 27 ప్రాజెక్టులు, రూ.29,021 కోట్ల పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆమోదం!

Industrial Development in AP: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానమే ప్రభుత్వ ప్రాధాన్యత అని, ఆమోదం పొందిన ప్రతీ ప్రాజెక్టు వేగంగా కార్యరూపం దాల్చాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Published : 2026-02-18 22:22:00
  • ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 22,407 ఉద్యోగాల కల్పన..
     
  • ప్రాజెక్టుల పురోగతిపై ఇకపై ప్రతినెలా సమీక్షించనున్న ముఖ్యమంత్రి..

Industrial Development in AP: ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా ప్రపంచ పటంలో నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. కేవలం కాగితాల మీద ఒప్పందాలు చేసుకోవడమే కాదు, అవి క్షేత్రస్థాయిలో ఎప్పుడు పూర్తవుతాయి? సామాన్య యువతకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? అనే దానిపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం జరిగిన 15వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం ఇందుకు వేదికైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఖరారయ్యాయి.

మొత్తం ప్రాజెక్టులు: 27 కంపెనీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
పెట్టుబడి విలువ: సుమారు రూ.29,021 కోట్లు.

ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 22,407 మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి లభించనుంది. గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఏవైనా అడ్డంకులు ఉంటే వెంటనే తొలగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పరిశ్రమల స్థాపనలో జాప్యం జరిగితే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. ఇకపై ప్రతి నెలా తానే స్వయంగా ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షిస్తానని చెప్పారు. పరిశ్రమల కోసం భూములు తీసుకుని, నిర్ణీత కాలంలో పనులు మొదలుపెట్టని సంస్థల నుంచి ఆ భూములను వెనక్కి తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేశారు.

విదేశాల్లో ఉన్న తెలుగువారు (NRIs) తమ సొంత రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, వారు ఇక్కడ పెట్టుబడులు పెడితే ప్రత్యేక సహకారం అందిస్తామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అందమైన తీర ప్రాంతాలను, ఆధ్యాత్మిక నగరాలను ఆదాయ వనరులుగా మార్చేందుకు ప్లాన్ చేశారు. విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను టూరిజం హబ్‌లుగా మారుస్తారు. విశాఖలో నిర్మించబోయే 'భారత్ మండపం' దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా నిర్మించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల హోటల్ రూములను అందుబాటులోకి తేవాలని, తిరుపతిని ఒక 'వెడ్డింగ్ డెస్టినేషన్'గా మార్చి ప్రపంచ స్థాయి పెళ్లిళ్లకు వేదిక చేయాలని సూచించారు.

పరిశ్రమలు వస్తున్నాయి సరే.. మరి ఉద్యోగాలు ఎవరికి వస్తున్నాయి? ఈ పారదర్శకత కోసమే 'నైపుణ్యం పోర్టల్'ను తీసుకురాబోతున్నారు. ఇందులో ఏ కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి అనే వివరాలు రియల్ టైమ్‌లో కనిపిస్తాయి. దీనివల్ల నిరుద్యోగ యువతకు ఎక్కడ అవకాశాలు ఉన్నాయో సులభంగా తెలుస్తుంది.

15వ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం పొందిన ప్రాజెక్టుల వివరాలు:
1.యశస్వ పవర్ ఎల్ఎల్‌పీ: శ్రీ సత్యసాయి జిల్లాలో సోలార్ విద్యుత్ పార్క్, రూ.1,200 కోట్ల పెట్టుబడి, 690 మందికి ఉద్యోగాలు.
2.క్రోమా ఆటార్ ఇంటర్నేషనల్: పల్నాడు జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్, రూ.2,000 కోట్ల పెట్టుబడి, 5,000 మందికి ఉద్యోగాలు.
3.క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రీడ్ ట్వల్వ్ ప్రైవేట్ లిమిటెడ్: అనంతపురం జిల్లాలో పవర్ ప్రాజెక్టు, రూ.1,391 కోట్ల పెట్టుబడి, 200 మందికి ఉద్యోగాలు.
4.క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రీడ్ థర్టీన్ ప్రైవేట్ లిమిటెడ్: అనంతపురం జిల్లాలో పవర్ ప్రాజెక్టు, రూ.1,391 కోట్ల పెట్టుబడి, 200 మందికి ఉద్యోగాలు.
5.రెన్యూ ఫోటో వోల్టాయిక్స్ ప్రైవేట్ లిమిటెడ్: కర్నూలు జిల్లాలో సోలార్ హైబ్రీడ్ ప్రాజెక్టు, రూ.1,461 కోట్ల పెట్టుబడి, 500 మందికి ఉద్యోగాలు.


6.ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్: కర్నూలు జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్టు, రూ.4,500 కోట్ల పెట్టుబడి, 3,100 మందికి ఉద్యోగాలు.
7.అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్: విశాఖలో సెమీకండక్టర్ ప్రాజెక్టు, రూ.2,387.81 కోట్ల పెట్టుబడి, 1,000 మందికి ఉద్యోగాలు.
8.కంపాస్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్: తూర్పు గోదావరి జిల్లాలో పర్యాటక ప్రాజెక్టు, రూ.101.28 కోట్ల పెట్టుబడి, 150 మందికి ఉద్యోగాలు.
9.ఆకేసియా హోటల్స్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్: గుంటూరు జిల్లాలో పర్యాటక ప్రాజెక్టు, రూ.330 కోట్ల పెట్టుబడి, 372 మందికి ఉద్యోగాలు.
10. వీరాంజనేయ హాస్పిటాలిటీ: విశాఖ రుషికొండలో పర్యాటక ప్రాజెక్టు, రూ.89.32 కోట్ల పెట్టుబడి, 150 ఉద్యోగాలు.


11. అక్షయ హోటల్స్ అండ్ రిసార్ట్స్: బాపట్ల జిల్లాలో టూరిజం ప్రాజెక్టు, రూ.54.02 కోట్ల పెట్టుబడి, 80 మందికి ఉద్యోగాలు.
12. ఎకో ఐఎస్ఎల్‌ఈ రిసార్ట్స్: అల్లూరి జిల్లాలో పర్యాటక ప్రాజెక్టు, రూ.262.87 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు.
13. సైబర్ సిటీ బిల్డర్స్ & డెవలపర్స్, దివ్యశ్రీ హోల్డింగ్స్ కన్సార్షియం: తిరుపతిలో పర్యాటక ప్రాజెక్టు, రూ.1,226.32 కోట్ల పెట్టుబడి, 1,500 మందికి ఉద్యోగాలు.
14. కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్: విశాఖలో టూరిజం ప్రాజెక్టు, రూ.280.51 కోట్ల పెట్టుబడి, 310 మందికి ఉద్యోగాలు.


15. రుషికొండ బీచ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్: విశాఖలో పర్యాటక ప్రాజెక్టు, రూ.424.20 కోట్ల పెట్టుబడి, 450 మందికి ఉద్యోగాలు.
16. ఎస్వీఎస్ కనస్ట్రక్షన్స్: పర్యాటక ప్రాజెక్టు, రూ.104 కోట్ల పెట్టుబడి, 300 మందికి ఉద్యోగాలు.
17. రాధికా వెజిటబుల్ ఆయిల్స్ లిమిటెడ్: విజయనగరం జిల్లాలో పామాయిల్ ప్రాసెసింగ్ యూనిట్, రూ.240 కోట్ల పెట్టుబడి, 304 మందికి ఉద్యోగాలు.
18. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్: తిరుపతి జిల్లా చంద్రగిరిలో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్, రూ.209.68 కోట్ల పెట్టుబడి, 35 మందికి ఉద్యోగాలు.
19. ఏసీఈ ఇంటర్నేషనల్ లిమిటెడ్: చిత్తూరు జిల్లాలో డైరీ ప్రాసెసింగ్ యూనిట్, రూ.786.15 కోట్లు, 1,000 మందికి ఉద్యోగాలు.


20. వారీ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్: అనకాపల్లి జిల్లాలో లీథియం అయాన్ సెల్స్ గిగా ఫ్యాక్టరీ, రూ.8,175 కోట్ల పెట్టుబడి, 3,000 మందికి ఉద్యోగాలు.
21. సిగాచీ ఇండస్ట్రీస్ లిమిటెడ్: కర్నూలు జిల్లాలో సింథటిక్ ఆర్గానిక్ కెమికల్స్, రూ.314.66 కోట్లు, 780 మందికి ఉద్యోగాలు.
22. నాన్ గ్రీన్ మెట్ ప్రైవేట్ లిమిటెడ్: నాయుడుపేటలో లిథియం ఆయాన్ బ్యాటరీ ప్రాసెసింగ్ యూనిట్, రూ.1,366 కోట్లు, 340 మందికి ఉద్యోగాలు.
23. బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్: అనకాపల్లి జిల్లాలో ఎండీఎఫ్ బోర్డు తయారీ యూనిట్, రూ.58.19 కోట్లు.
24. సిరి బయోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్: ఎన్టీఆర్ జిల్లాలో పౌల్ట్రీ, ష్రింప్, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, రూ.37 కోట్ల పెట్టుబడి, 74 మందికి ఉద్యోగాలు.
25. సిరి బయోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్: శ్రీ సత్యసాయి జిల్లాలో పౌల్ట్రీ, ష్రింప్, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, రూ.22 కోట్ల పెట్టుబడి, 37 మందికి ఉద్యోగాలు.
26. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్: నెల్లూరు జిల్లాలో డిఫెన్స్ ఎక్స్‌ప్లోజివ్స్ తయారీ యూనిట్, రూ.500 కోట్ల పెట్టుబడి, 2,050 మందికి ఉద్యోగాలు.
27. స్కై స్టోరేజ్ లిమిటెడ్: విశాఖ జిల్లాలో వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ యూనిట్, రూ.106 కోట్ల పెట్టుబడి, 285 మందికి ఉద్యోగాలు.

Spotlight

Read More →