Minister Gottipati: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి సంక్షేమ పర్యటన.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ! Nara Lokesh: ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నం: ఐబీఎం రాకతో నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు.! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు! Ambedkar Jayanti 2026: అంబేద్కర్ జయంతి 2026: ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా సెలవు.. ఏవి తెరుస్తారు? ఏవి మూసివేస్తారు? Amaravati Works: అమరావతి పునర్వైభవం.. శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణ పనులు! Elevated Corridor: 41 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌.. రూ.18,500 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే Chandrababu: టీడీపీ కేడ‌ర్‌కు 'ఈ-3'... చంద్ర‌బాబు కీలక ప్రకటన! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Minister Gottipati: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి సంక్షేమ పర్యటన.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ! Nara Lokesh: ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నం: ఐబీఎం రాకతో నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు.! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు! Ambedkar Jayanti 2026: అంబేద్కర్ జయంతి 2026: ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా సెలవు.. ఏవి తెరుస్తారు? ఏవి మూసివేస్తారు? Amaravati Works: అమరావతి పునర్వైభవం.. శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణ పనులు! Elevated Corridor: 41 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌.. రూ.18,500 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే Chandrababu: టీడీపీ కేడ‌ర్‌కు 'ఈ-3'... చంద్ర‌బాబు కీలక ప్రకటన! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

Chandra Babu: సీఎం చంద్రబాబుతో బీసీ సంఘాల భేటీ! రిజర్వేషన్లు, ప్రత్యేక చట్టంపై వినతులు!

Chandra Babu: రాష్ట్రంలో బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బీసీల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

Published : 2026-04-10 21:27:00

ప్రత్యేక బీసీ కమిషన్, రక్షణ చట్టం ప్రవేశపెట్టాలని వినతి.. 

స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు.. 

అమరావతి: రాష్ట్రంలో బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బీసీల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

శుక్రవారం సచివాలయంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం నేతలు సీఎంను కలిశారు. రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, జాతీయ అధ్యక్షుడు జే. శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో వచ్చిన ప్రతినిధి బృందం ముఖ్యమంత్రికి వినతిపత్రాలు అందించింది.

బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రంతో చర్చించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. అలాగే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు.

ఇంకా పలు ముఖ్యమైన అంశాలను కూడా ప్రస్తావించారు: 
స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ల అమలు
ఓబీసీల కోసం ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు
ఓబీసీ సబ్ ప్లాన్ రూపకల్పన చేసి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు
ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ

బీసీ నేతల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ముఖ్యమంత్రి, కేంద్రం పరిధిలో ఉన్న అంశాలను అక్కడి ప్రభుత్వంతో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బీసీలకు పూర్తి న్యాయం జరిగేలా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బీసీ సంఘాల నేతలు కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. బీసీల అభ్యున్నతి ఈ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. చేనేతలకు ఉచిత విద్యుత్, మత్స్యకారులకు వేట నిషేధ భృతి, 217 జీవో రద్దు, కల్లు గీత కార్మికులకు 10% రిజర్వేషన్లు, వడ్డెరలకు మైనింగ్‌లో రిజర్వేషన్లు వంటి పలు నిర్ణయాలు ప్రభుత్వానికి మంచి పేరును తెచ్చాయని పేర్కొన్నారు.

బీసీల అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుండగా, ఈ భేటీ ద్వారా వారి సమస్యలకు పరిష్కారం దొరకాలని ఆశాభావం వ్యక్తమవుతోంది.

Spotlight

Read More →