- కువైట్ ఒమేరియా పార్కులో రంజాన్ సందడి: ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు!
- శాంతి, సోదరభావానికి రంజాన్ ప్రతీక: ఇఫ్తార్ విందులో ప్రవాస నేతల సందేశం..
Kuwait Updates: పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మదీయసోదరులు ఎంతో నిష్టతో ఉండే ఉపవాస దీక్షల సందర్భంగా ఇఫ్తార్ విందును కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యములో మద్దిన ఈశ్వర్ నాయుడు అధ్యక్షతన కంచన రెడ్డి శేఖర్ మరియు పటాన్ ఖాదర్ ఖాన్ లు ఏర్పాటు చేశారు. ఫర్వానియా ప్రాంతంలో ఉన్న ఒమేరియా పార్కులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమములో కువైట్లోని పలు ప్రాంతాలనుండి వందలసంఖ్యలో తెలుగుదేశం మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా సుధాకర రావు మాట్లాడుతూ కార్యక్రమానికి విచ్చేసిన మహమ్మదీయ సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియచేశారు. రంజాన్ మాసం అందరిలోను క్రమశిక్షణ, సహనం, మరియు దైవభక్తిని పెంపొందించే పవిత్ర మాసం. రంజాన్ శాంతి, సోదరభావం అనే సందేశాన్ని మరియు మానవాళికి హితాన్ని బోధిస్తుంది. ఈ నెలలో అందరూ ఇతరుల పట్ల దయ, సానుభూతి, మరియు ప్రేమను ప్రదర్శిస్తారు అని అన్నారు.
అధ్యక్షుడు ఈశ్వర్ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మైనార్టీల పక్షపాత పార్టీ అనీ, కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పధకాలను మైనార్టీలకోసం ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ శ్రీ కుదరవల్లి సుధాకర రావు, ఎన్నరై టీడీపీ కువైట్ అధ్యక్షుడు శ్రీ మద్దిన ఈశ్వర్ నాయుడు, ఎన్నారై టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ మాలేపాటి సురేష్ బాబు నాయుడు, సుగవాసి యువసేన అధ్యక్షుడు శ్రీ కంచన రెడ్డి శేఖర్, ఎన్నరై టీడీపీ మైనార్టీ నాయకుదు శ్రీ పటాన్ ఖాదర్ ఖాన్, కొల్లి ఆంజనేయులు, ఖాదరున్, వేణు రాజు, గాజులపల్లి సుబ్బారెడ్డి, తిరుపతి రాజు, జిలాని బాషా, సుబ్బు, మహేష్ కోడూరి, చిన్నా రాజు, గల్ఫ్ జనసేన నాయకులు గల్ఫ్ జాతీయ కన్వీనర్ శ్రీ కంచన శ్రీకాంత్, కువైట్ కన్వీనర్ శ్రీ ఆంజన కుమార్ పగడాల,శ్రీ ఆకుల రాజేష్, కువైట్ కో- కన్వీనర్స్ శ్రీ జగిలి ఓబులేష్, శ్రీ ఆలి షేక్, శ్రీ ఇమ్మిడిసెట్టి సూర్యనారయణ, ప్రేం రాయల్, చంద్రశెఖర్ తదితరులు పాల్గొన్నారు.