ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తు వైమానిక రంగానికి మైలురాయి కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఇటీవల ఇక్కడి నిర్మాణాలను పరిశీలించి, ప్రాజెక్టు పురోగతిని అధికారులతో చర్చించారు.
ప్రాజెక్టు పనులు ప్రస్తుతం 91 శాతం పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు. నావిగేషన్, ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌ల వంటి అంతర్జాతీయ ప్రమాణాల సదుపాయాలు నిర్మిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, వ్యాపార మరియు పర్యాటక కార్యకలాపాలు విస్తరిస్తాయి.
ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్రానికి వ్యూహాత్మక కేంద్రంగా మారనుంది. భోగాపురంలో ఏర్పాటు అవుతున్న ఏవియేషన్ యూనివర్సిటీ ద్వారా యువతకు విమానాశ్రయ, ఎయిర్ ట్రాఫిక్, ఏరోనాటిక్స్ రంగాలలో నైపుణ్యం సాధించడానికి అవకాశం లభిస్తుంది చెప్పుకొచ్చారు.
రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం 2026 జూన్ వరకు పూర్తి చేసి దేశానికి అంకితం చెయ్యాలనేదే మా లక్ష్యం అని తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రాజెక్టును రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తూ ప్రతి అడ్డంకిని తొలగించి సమయానికి పూర్తి చేయడానికి అధికారులను ప్రోత్సహిస్తున్నారన్నారు అని తెలిపారు.
విమానాశ్రయం ప్రారంభమయ్యే సమయంలో ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ట్రావెల్ సౌకర్యం పెరగడం, మరియు స్థానిక వ్యాపారం, లాజిస్టిక్స్ రంగాలకు కొత్త ఊరట లభించడం అవకాశం ఉంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ఏవియేషన్ యూనివర్సిటీ కలిపి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైమానిక రంగంలో ముందుకు తీసుకెళ్తాయని కేంద్ర మంత్రి తెలిపారు.