నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని దగదర్తి గ్రామంలో రాష్ట్ర ఆగ్రోస్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దివంగత మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం రోడ్డు మార్గంలో పయనమయ్యారు. ఆయన ప్రయాణ దారిలో ప్రజలు, టిడిపి కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వాగతం పలికారు.
ఒంగోలు పట్టణంలో నుంచే లోకేష్ పర్యటన ఉత్సాహంగా సాగింది. టంగుటూరు టోల్ గేట్ వద్ద ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పూలదండలు, బానర్లు, నినాదాలతో ఘనంగా స్వాగతించారు. లోకేష్ జయహో – అభివృద్ధి దిశగా ఆంధ్ర ప్రదేశ్! అంటూ నినాదాలతో కార్యకర్తలు పాల్గొన్నారు.
తర్వాత కందుకూరు నియోజకవర్గం తెట్టు వద్ద ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు, యువతీ యువకులు రోడ్ల వెంట నిలబడి లోకేష్ గారికి స్వాగతం పలికారు. గజమాలలు, పూల వర్షం మధ్య లోకేష్ కారు ప్రయాణం కొనసాగింది. ప్రజల్లో ఉత్సాహం, ఆనందం నిండిపోయింది.
నాయకత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండటం వారి మాట వినడం, అభివృద్ధి దిశగా ఆలోచించడం నారా లోకేష్ ఆ లక్షణాలన్నింటినీ ప్రతిరోజూ చూపుతున్నారు. టిడిపి నాయకత్వం లో ఆయన ఆచరణాత్మక రాజకీయాలకు చిహ్నంగా నిలుస్తున్నారు. పునఃప్రారంభమైన ప్రభుత్వ యంత్రాంగంలో యువ నాయకత్వం ఎంత అవసరమో ఆయన నిరూపిస్తున్నారు.
టిడిపి ప్రభుత్వంలో నారా లోకేష్ విద్యాశాఖ, ఐటీ శాఖలలో సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. పాఠశాలలకు ఆధునిక సదుపాయాలు, డిజిటల్ క్లాస్ రూములు, టీచర్ ట్రైనింగ్‌లో కొత్త మార్గదర్శకాలు, విద్యార్థుల భవిష్యత్ కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రతి విద్యార్థి మంచి భవిష్యత్తు కోసం చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవాలనే ఉద్దేశంతో “డిజిటల్ లెర్నింగ్ మిషన్”ను తీసుకువచ్చారు.
అలాగే ఐటీ రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ హబ్‌గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త ఐటీ పార్కులు, స్టార్టప్ సెంటర్లు, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా పలు ప్రాజెక్టులు మొదలుపెట్టారు. ఇప్పటికే గూగుల్ సంస్థను, మరి ఇతర సంస్థల ఆహ్వానించిన విషయం అందరికీ తెలిసిందే లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో డిజిటల్ మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
దగదర్తి పర్యటనలో ప్రజల ప్రేమాభిమానాలు, పార్టీ శ్రేణుల ఉత్సాహం – ఇవన్నీ నారా లోకేష్ గారి పట్ల ఉన్న విశ్వాసాన్ని మరోసారి స్పష్టంగా చూపించాయి. ఆయన ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గం చూపే తీరే టిడిపి ప్రభుత్వానికి బలంగా నిలుస్తోంది.