ఓటీటీ ప్రేక్షకుల కోసం ఈ వారం నిజంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ వారం కానుంది. థ్రిల్లింగ్, హారర్, పొలిటికల్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్ ఇలా అన్ని రకాల జోనర్స్‌తో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు నవంబర్ మొదటి వారంలోనే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఎనిమిది ప్రధానమైన టైటిల్స్ ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇవి ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో చూద్దాం.
ఫ్రాంకిన్‌స్టన్
ఆస్కార్ ఐజాక్, జాకబ్ ఎలోర్డి, మియా గోత్, క్రిస్టోఫ్ వాల్ట్జ్ నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని అందించనుంది. మానవ సృష్టి, శాస్త్రం మరియు భయానకత కలిసిన ఈ సినిమా నవంబర్ 7 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
బారాముల్లా
‘ఆర్టికల్ 370’ తర్వాత దర్శకుడు ఆదిత్య జంభాలే తెరకెక్కించిన మరో థ్రిల్లర్ ఇది. మానవ్ కౌల్, భాషా సుంబ్లీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ థ్రిల్లర్ కూడా నవంబర్ 7న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. కాశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను సస్పెన్స్‌లో ఉంచుతుంది.
ఫస్ట్ కాపీ సీజన్ 2
క్రిస్టల్ డిసౌజా, గుల్షన్ గ్రోవర్, ఆషి సింగ్ తదితరులు నటించిన ఈ సిరీస్ రెండవ సీజన్ నవంబర్ 5 నుండి ఎమ్ఎక్స్ ప్లేయర్లో ప్రీమియర్ అవుతోంది. క్రైమ్, డ్రామా, ఎమోషన్స్ మేళవించిన ఈ సీజన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మహారాణి సీజన్ 4
హుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ డ్రామా ‘మహారాణి’ నాలుగో సీజన్ నవంబర్ 7 నుంచి సోనీ లివ్‌లో ప్రసారం కానుంది. రాజకీయ కుతంత్రాలు, అధికార పోరాటాలు, కుటుంబ తగాదాలు ఈ సీజన్లో మరింత ఆసక్తిని రేకెత్తించనున్నాయి.
తోడే దూర్ తోడే పాస్
పంకజ్ కపూర్, మోనా సింగ్ నటించిన ఈ హ్యూమన్ డ్రామా ఫ్యామిలీ రెలేషన్‌షిప్స్ చుట్టూ తిరుగుతుంది. మనుషుల మధ్య దూరాలు, అనుబంధాల విలువలను చూపించే ఈ సినిమా నవంబర్ 7న జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.
ప్లురిబస్
రియా సీహార్న్ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి యాపిల్ టీవీ ప్లస్‌లో ప్రసారం కానుంది. సీరీస్‌లో ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ డిసెంబర్ 26 వరకు విడుదల అవుతుంది. మిస్టరీ, డ్రామా, సైకలాజికల్ ట్విస్టులు ఇందులో ప్రధాన ఆకర్షణ.
ది హ్యాక్
బ్రిటన్‌లో జరిగిన అతిపెద్ద మీడియా కుంభకోణం ఆధారంగా రూపొందిన ఈ సినిమా నవంబర్ 7న లయన్స్ గేట్ ప్లేలో ఓటీటీ ప్రీమియర్ అవుతుంది. డేవిడ్ టెన్నాంట్, రాబర్ట్ కార్లైల్, రోజ్ లెస్లీ నటించిన ఈ చిత్రం మీడియా ఎథిక్స్‌పై ప్రశ్నలు లేవనెత్తుతుంది.
యాజ్ యూ స్టుడ్ బై
కొరియన్ థ్రిల్లర్ సిరీస్‌లను ఇష్టపడే వారికి ఇది ఒక సర్ప్రైజ్. జియోంగ్ సో-నీ, లీ యు-మి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ నవంబర్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రమాదకర పరిస్థితుల్లో బతికేందుకు చేసే పోరాటమే కథ.
మొత్తంగా చూస్తే నవంబర్ మొదటి వారం ఓటీటీ ప్రియులకు ఒక ఎంటర్టైనింగ్ ఫీస్ట్ లాంటిదే. ప్రతి సినిమా, సిరీస్ తనదైన జానర్లో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది.