Maruti Suzuki: మారుతికి కొత్త తలనొప్పి - ఆరు నెలల్లో.. రెండు కుటుంబాలకు సరిపోయే మారుతి ఇన్విక్టో..

దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో (NITs), ట్రిపుల్‌ ఐటీల్లో (IIITs), ఇతర ప్రఖ్యాత ఇంజనీరింగ్‌ సంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి బీటెక్‌, బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (JEE Main–2026) మొదటి విడత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తోంది. నవంబర్‌ 27, 2025 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. అదేరోజు రాత్రి 11:50 గంటల వరకు అప్లికేషన్‌ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.

Land Registration: రాష్ట్ర ప్రజలకు మరో తీపి కబురు.. కొత్త స్కీమ్.. ఆ భూములు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు!

జేఈఈ మెయిన్‌ మొదటి సెషన్‌ పరీక్షలు 2026 జనవరి 21 నుంచి 30 మధ్య జరగనున్నాయి. పరీక్షలు రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు — ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. పరీక్ష కేంద్రాల వివరాలను జనవరి మొదటి వారంలో విడుదల చేయనున్నారు. పరీక్షకు వారం ముందు అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొదటి సెషన్‌ ఫలితాలు ఫిబ్రవరి 12న ప్రకటించనున్నట్లు NTA తెలిపింది.

Technology: క్రోమ్‌ వాడుతున్నారా? మీ డేటా ప్రమాదంలో ఉండొచ్చు – ఈ బ్రౌజర్లు మీకు సేఫ్‌ జోన్!

జేఈఈ మెయిన్‌ పరీక్షలో సాధించే పర్సంటైల్‌ ఆధారంగా దేశంలోని ప్రముఖ ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, సెంట్రల్‌ ఫండెడ్‌ టెక్నికల్‌ ఇన్స్టిట్యూట్‌లలో (CFTIs) బీటెక్‌, బీఈ, బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 2024 లేదా 2025లో 12వ తరగతి లేదా సమాన అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌ పరీక్షకు వయోపరిమితి లేదని NTA స్పష్టం చేసింది. విద్యార్థులు ఒకే సంవత్సరం రెండు సెషన్లలో పరీక్ష రాయవచ్చు. ఆ రెండు ప్రయత్నాల్లో ఉత్తమ పర్సంటైల్‌ను మాత్రమే తుది ఫలితాల కోసం పరిగణనలోకి తీసుకుంటారు.

త్వరపడండి.. అండమాన్ యాత్రకు వెళ్తారా..? విశాఖ నుంచి కొత్త టూర్.. ప్యాకేజీ వివరాలు ఇక్కడ చూడండి!

తాజాగా NTA మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్‌ పరీక్షలను మొత్తం 13 భాషల్లో నిర్వహించనున్నారు. ఇందులో తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ భాషలు ఉన్నాయి. ఈ నిర్ణయం దేశంలోని ప్రాంతీయ భాషా విద్యార్థులకు పెద్ద ఉపశమనం కలిగించనుంది. రెండో సెషన్‌ పరీక్షలు 2026 ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షల ద్వారా ఇంజనీరింగ్‌ రంగంలో కెరీర్‌ నిర్మించాలనుకునే విద్యార్థులకు ఇది అత్యంత కీలక అవకాశం కానుంది.

CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..!
Delhi air pollution: ఇంద్రప్రస్థం చుట్టుముట్టిన వాయు కాలుష్యం – ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిన రాజధాని!
Bhagavad Gita: అపరా భక్తి మనసును స్థిరం చేస్తుంది, పరా భక్తి మనసును మోక్షానికి తీసుకెళ్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -49!
Motorola నుంచి మరో సంచలనం! తక్కువ ధరలో హైఎండ్ ఫీచర్లు... 7700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!
Team India: మూడోసారి ఫైనల్ చేరిన టీమ్ ఇండియా.. ఈసారి టైటిల్ తప్పక గెలుస్తామన్న హర్మన్ సేన!
కెమిస్ట్రీ మామూలుగా లేదు.. తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ జంట.. పెళ్లి తేదీపై ఆశలు! అభిమానుల్లో పెరిగిన ఉత్కంఠ!