Delhi air pollution: ఇంద్రప్రస్థం చుట్టుముట్టిన వాయు కాలుష్యం – ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిన రాజధాని!

దేశవ్యాప్తంగా లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రతిష్ఠాత్మకమైన కామన్ లా అడ్మిషన్ టెస్ట్‌ (CLAT) 2026 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్‌గ్రాడ్యుయేట్‌ (యూజీ), పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ (పీజీ) లా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు నవంబర్‌ 7 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 24 నేషనల్‌ లా యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం డిసెంబర్‌ 7న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

Bhagavad Gita: అపరా భక్తి మనసును స్థిరం చేస్తుంది, పరా భక్తి మనసును మోక్షానికి తీసుకెళ్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -49!

క్లాట్‌ పరీక్ష ద్వారా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ (యూజీ) మరియు ఏడాది ఎల్‌ఎల్‌ఎం (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయి. యూజీ కోర్సుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఇంటర్‌లో 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. పీజీ కోర్సులకు మాత్రం ఎల్‌ఎల్‌బీ డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలి. ఈ అర్హతలను కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. క్లాట్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా దేశంలోని ప్రముఖ లా యూనివర్సిటీల్లో సీట్లు కేటాయించబడతాయి.

Motorola నుంచి మరో సంచలనం! తక్కువ ధరలో హైఎండ్ ఫీచర్లు... 7700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!

ఇక డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అండర్‌గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ (యూసీడ్‌) 2026 నోటిఫికేషన్‌ను కూడా ఇటీవల ఐఐటీ బాంబే విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఐఐటీలు, ఐఐఐటీడీఎం జబల్పూర్‌ వంటి ప్రముఖ డిజైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ల్లో బీ.డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయి. యూసీడ్‌ పరీక్ష ఫలితాలు ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతాయి.

Team India: మూడోసారి ఫైనల్ చేరిన టీమ్ ఇండియా.. ఈసారి టైటిల్ తప్పక గెలుస్తామన్న హర్మన్ సేన!

ఇంటర్‌ అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్‌ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుంతో నవంబర్‌ 10 వరకు అవకాశం ఉంది. జనవరి 18, 2026న యూసీడ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఫలితాలను మార్చి 6న ప్రకటించనున్నారు. ఈ పరీక్ష ద్వారా సృజనాత్మకత, డిజైన్‌ ఆలోచన, విజువల్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను అంచనా వేస్తారు. విద్యార్థులు తమ అభిరుచి ప్రకారం లా లేదా డిజైన్‌ రంగాల్లో ప్రవేశాల కోసం ఇప్పుడే దరఖాస్తులు పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కెమిస్ట్రీ మామూలుగా లేదు.. తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ జంట.. పెళ్లి తేదీపై ఆశలు! అభిమానుల్లో పెరిగిన ఉత్కంఠ!
iPhone 16 Plus: జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్ ప్రత్యేక ఆఫర్ – ఇంత తక్కువ ధరకా? త్వరపడండి!
భారీగా బంగారం నిల్వలు పెంచుతున్న భారత్! పెద్ద ప్లాన్..
తప్పు చేసిన సరే, అలా చెబితే సహించనంటున్న మిల్క్ బ్యూటీ! బ్రేకప్ వెనుక కారణం ఇదేనా?
Qatar: ఖతార్ లో కార్తీక మాస వనభోజనాలు..! పెద్దఎత్తున హాజరైన ప్రవాసాంధులు..!
Venezuela: కొన్ని గంటల్లోనే అటాక్స్ జరిగే అవకాశం... అంతర్జాతీయ మీడియా సంచలనం!