వరస పాన్ ఇండియా సినిమాలతో తెగ బిజీగా ఉన్న తెలుగు స్టార్ హీరో ఎవరు అంటే.. వెంటనే ఎవరైనా చెప్పే పేరు ప్రభాస్. దాదాపు నాలుగైదు.. పాన్ ఇండియా సినిమా షూటింగ్స్ తో.. రాబోయే రెండు, మూడు సంవత్సరాలకి కాను.. ఈ హీరో కాల్ షీట్స్ నిండిపోయాయి .
ఇక ఈ సినిమాలన్నీ పూర్తయ్యే వరకు ప్రభాస్ పెళ్లి చేసుకోరా ఏమిటా అని అనుమానం కూడా ఆయన అభిమానుల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో ఒక వార్త వాళ్లకు ఆనందం తెప్పిస్తోంది.
కొన్ని వెబ్సైట్ కథనాల ప్రకారం.. ప్రభాస్ కి పెళ్లి కుదిరింది అని.. త్వరలోనే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
అయితే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి చెందినా అమ్మాయి కాదు అని కూడా సమాచారం. అయితే ఆమె మంచి బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలోని అమ్మాయి అని.. అలానే వాళ్ళకి ఆస్తిపాస్తులు కూడా ఎక్కువే అన్న వార్త వినిపిస్తోంది.
ఈ వార్త అధికారికంగా వెల్లడించకపోయిన.... ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతూ ఉంది. అయితే గతంలో కూడా ఈ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా మధ్యలో కృష్ణంరాజు మరణం వల్ల మళ్ళీ ప్రభాస్ పెళ్లి వాయిదా అయిందని.. అంతకుముందు అనుకున్న అమ్మాయితోనే ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ ఫ్యామిలీ సంబంధం కుదుర్చుకోవాలి అనుకుంటున్నారు అని కూడా వార్త వినిపిస్తోంది. మరి ఇందులో నిజం ఎంతో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.