తెలంగాణలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీలు చక్రధర్ రావు, శాంతారావులు మృతిచెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో విధుల్లోనే వారు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
– నారా లోకేష్
Nara Lokesh: ఆపరేషన్ మిడిల్లో ప్రాణాలు కోల్పోయిన అధికారులు..! మృతుల కుటుంబాలకు లోకేష్ ప్రగాఢ సానుభూతి!