ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కొత్త లిక్కర్ పాలసీ అమలుతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగింది. రూ.99 ధరకు అమ్మే క్వార్టర్ల డిమాండ్ భారీగా పెరగడం గమనార్హం. ఇప్పుడు అదే బాటలో బార్‌ల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక పాలసీ రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. లైసెన్స్ విధానంలో మార్పులు: కొత్త బార్ పాలసీకి తుది రూపం సిద్ధమవుతోంది. ఇప్పటికే అనేక ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మద్యం దుకాణాల లైసెన్సుల మాదిరిగానే బార్లకు కూడా లాటరీ విధానంలో లైసెన్స్‌లను కేటాయించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో (జగన్ పాలనలో) వేలం పద్ధతిలో లైసెన్సులు ఇచ్చారు. కానీ ఇప్పుడు లాటరీ విధానాన్ని అమలు చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
లైసెన్స్ ఫీజులకు రెండు ప్రతిపాదనలు: 1. ప్రతిపాదన – తక్కువ ఫీజులు (బార్ల సంఖ్య పెంపు పథకం): నగర పంచాయతీలలో: ₹35 లక్షలు. మున్సిపాలిటీలలో: ₹40 లక్షలు కార్పొరేషన్లలో: ₹45 లక్షలు. 2. ప్రతిపాదన – ఎక్కువ ఫీజులు (యథావిధిగా కొనసాగింపు): నగర పంచాయతీలలో: ₹55 లక్షలు మున్సిపాలిటీలలో: ₹65 లక్షలు కార్పొరేషన్లలో: ₹75 లక్షలు