ఔత్సాహిక ఇంజినీర్లకు గూగుల్ ఆండ్రాయిడ్ విభాగం హెడ్ సమీర్ సమత్ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. కేవలం కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కలిగి ఉండటం మాత్రమేగాక, ప్రతిభ, నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం అభివృద్ధి చేయాలని అన్నారు.
కేవలం కోడింగ్ మాత్రమే కాకుండా, క్లిష్టమైన సమస్యలపై పని చేయడం, స్కేలబుల్ సిస్టమ్‌ల రూపకల్పన, టీమ్ వర్క్, కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు కూడా అవసరమన్నారు. ప్రోగ్రామింగ్ పనులన్నీ క్రమంగా AI చేపడుతున్న నేపథ్యంలో, అభ్యర్థులు డిగ్రీకి మించి ఆలోచించి, సృజనాత్మకత, లోతైన పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు.