హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానం (AI-315) ల్యాండింగ్ అయిన కొద్దిసేపటికే పవర్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. విమానం సహాయక విద్యుత్ యూనిట్ (ఏపీయూ)లో మంటలు అంటుకున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని, ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడినట్టు తెలిపింది. విమానానికి స్వల్ప నష్టం జరిగిందని, పూర్తిస్థాయి పరిశీలన కోసం విమానాన్ని సేవలో నుంచి తాత్కాలికంగా తొలగించినట్టు సంస్థ వెల్లడించింది.