ఏపీలోని అర్హులైన రైతులకు త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.7000 బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానుంది. ఈ పథకం కింద పీఎం కిసాన్ యోజనతో కలిపి అమలవుతోంది. కేంద్రం నుంచి పీఎం కిసాన్ యోజన 20వ విడత నిధులు విడుదలైన వెంటనే ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధులు జారీ చేయనుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్ట్ 2న వారణాసిలో పర్యటించనున్న నేపథ్యంలో, అదే సమయంలో పీఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కేంద్ర పథకం కింద ఏటా మూడు విడతలుగా రైతులకు రూ.6000 అందిస్తారు. గత విడత డబ్బులు ఫిబ్రవరి 24న విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాలుగు నెలలు దాటడంతో, రైతులు ఆతృతగా కొత్త విడతను ఎదురుచూస్తున్నారు.
ఏపీ రైతులకు పీఎం కిసాన్ రూ.2000 + సుఖీభవ రూ.5000 కలిపి మొత్తం రూ.7000 జమ కాబోతోంది.
అర్హత కోసం గడువు జూలై 23 వరకు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హుల జాబితాలో లేని వారు జూలై 23 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అలాగే పథకం స్టేటస్ చెక్ చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 155251, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్, సుఖీభవ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు.