భారీగా బంగారం నిల్వలు పెంచుతున్న భారత్! పెద్ద ప్లాన్..

మహిళల ప్రపంచకప్ ఫైనల్‌కి వేదిక సిద్ధమైంది. మరో కొద్ది గంటల్లో భారత్ మరియు దక్షిణాఫ్రికా జట్లు ఆఖరి పోరులో తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ ఫలితంతో కొత్త చాంపియన్ అవతరించబోతోంది. ఇప్పటి వరకు ఎవరు ఈ టైటిల్‌ను సాధించలేదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ పోరుకు ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నారు.

తప్పు చేసిన సరే, అలా చెబితే సహించనంటున్న మిల్క్ బ్యూటీ! బ్రేకప్ వెనుక కారణం ఇదేనా?

టీమ్ ఇండియా ఇప్పటికే మూడోసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. గత రెండు సార్లు తృటిలో టైటిల్ చేజారడంతో ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలని హర్మన్‌ప్రిత్ కౌర్ సేన కసరత్తు చేస్తోంది. దాదాపు ఒక దశాబ్దంగా మహిళా క్రికెట్‌లో భారత్ తలపెట్టిన శ్రమ, కష్టాలు ఈ మ్యాచ్‌తో ఫలించాలని అభిమానులు కోరుకుంటున్నారు. హర్మన్‌, స్మృతి, శెఫాలి, దీప్తి వంటి ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉండటంతో భారత జట్టుపై విశ్వాసం మరింత పెరిగింది.

Qatar: ఖతార్ లో కార్తీక మాస వనభోజనాలు..! పెద్దఎత్తున హాజరైన ప్రవాసాంధులు..!

ఇక దక్షిణాఫ్రికా జట్టు విషయానికి వస్తే, ఇది వారి తొలి ఫైనల్. ఇప్పటి వరకు ఎన్నో సార్లు సెమీస్ వరకే ఆగిన ఈ జట్టు ఈసారి గట్టిగా పోరాడి ఫైనల్‌కు చేరుకుంది. ప్రోటియాస్ కెప్టెన్ లారా వోల్వార్డ్ మాట్లాడుతూ “ఫైనల్లో గెలిచి భారత అభిమానులను సైలెంట్ చేస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు. ఆమె మాటల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. అలాగే, "ఇరు జట్లపై ఒత్తిడి ఉంటుంది. కానీ ఎవరు ఆ ఒత్తిడిని జయిస్తారో వారే విజేతలు అవుతారు" అని పేర్కొన్నారు.

Venezuela: కొన్ని గంటల్లోనే అటాక్స్ జరిగే అవకాశం... అంతర్జాతీయ మీడియా సంచలనం!

2023 పురుషుల ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలతో లారా వ్యాఖ్యలు పోలి ఉన్నాయని అభిమానులు సోషల్ మీడియాలో సరదాగా చర్చించుకుంటున్నారు. భారత్ ఆ ఫైనల్‌లో ఓడిన సంగతి తెలిసిందే కాబట్టి ఈసారి మహిళల జట్టు ఆ చేదు జ్ఞాపకాలను తుడిచేసి దేశానికి చిరస్మరణీయమైన విజయాన్ని అందించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

APSDMA: బాపట్ల నుంచి నెల్లూరు దాకా వర్షాలు... APSDMA హెచ్చరిక!

మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వాతావరణం క్లియర్‌గా ఉండటంతో పూర్తి ఓవర్ల మ్యాచ్ జరగనుందని అంచనా. మొత్తం మీద ఈ ఫైనల్ కేవలం టైటిల్ పోరాటం కాదు, భారత మహిళా క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది కావొచ్చు. అభిమానులందరూ ఒకే స్వరంలో చెబుతున్నారు.
 

నారా భువనేశ్వరికి అంతర్జాతీయ గౌరవం! ప్రతిష్టాత్మక అవార్డు!
Andhra Pradesh: ఏపీలో 37 కరవు మండలాలు.. ఈ జిల్లాలోనే అత్యధిక ప్రభావం! – పూర్తి వివరాలు ఇక్కడ
TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..!
Polavaram: పోలవరం నిధుల వినియోగంపై మంత్రి సంచలనం! గత ప్రభుత్వ నిర్వాకం వల్లే ఆలస్యం... వారి ఖాతాల్లోకి ₹1000 కోట్ల పరిహారం పంపిణీ ప్రారంభం.
Liquor Scam: నకిలీ మద్యం కేసు! వైసీపీ మాజీ మంత్రి అరెస్ట్!
చిచ్చుపెట్టాలని చూస్తే నాశనమైపోతారు.. మంచు ఫ్యామిలీ విభేదాల రూమర్స్‌పై లక్ష్మి సంచలనం!
ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం.. రూ 1000 కోట్లు పంపిణీ.! దళారులను నమ్మొద్దు, మోసపోవద్దు!
అమెరికాలోని టాప్ 30 ఎయిర్‌పోర్టుల్లో సగం చోట్ల ఇదే సమస్య... దేశవ్యాప్తంగా ఆందోళన! రాబోయే వారం కూడా..