- డిసెంబర్ 12న విడుదలైన 'ఈషా'..
- నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే కథ…
Eesha Movie Updates: సాధారణంగా మన తెలుగు సినిమాల్లో హారర్ థ్రిల్లర్ అంటే.. ఏదో ఒక పాత బంగ్లా, ఒక ఆత్మ, కొంచెం కామెడీ కలిపి తక్కువ బడ్జెట్‌లో చుట్టేస్తారనే టాక్ ఉంది. కానీ, ఈ మధ్య కాలంలో 'మసూద' వంటి సినిమాలు ఆ అభిప్రాయాన్ని మార్చేశాయి. అదే బాటలో ప్రయోగాత్మకంగా వచ్చి, ప్రేక్షకులను గజగజ వణికించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 'ఈషా' (Eesha). ఈ సినిమా కథ నలుగురు ప్రాణ స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. వీళ్లకి దెయ్యాలు, ప్రేతాత్మలు అంటే అస్సలు నమ్మకం ఉండదు. సైన్స్‌ను నమ్మే వీరు, దెయ్యాల పేరుతో జనాన్ని మోసం చేసే దొంగ బాబాలను ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. అలా ఆదిదేవ్ అనే ఒక శక్తివంతుడైన స్వామీజీ అసలు రంగు బయటపెట్టాలని ఛాలెంజ్ చేస్తారు. ఆ క్రమంలో ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లోని ఒక మారుమూల ప్రాంతానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వారు ఎదుర్కొన్న భయానక పరిస్థితులే ఈ సినిమా అసలు కథ.
ఈ సినిమాలో మనకి తెలిసిన ముఖాలే కనిపిస్తాయి. చాలా కాలం తర్వాత ఒక మంచి క్యారెక్టర్‌లో కనిపించాడు. తన నటనతో సినిమాను నిలబెట్టాడు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఈ సినిమాలో ఒక సీరియస్ రోల్‌లో అదరగొట్టింది. ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వీరిద్దరూ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నలుగురు స్నేహితుల మధ్య బాండింగ్ చాలా నేచురల్‌గా అనిపిస్తుంది. హారర్ సినిమాకు ప్రాణం పోసేది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) మరియు సినిమాటోగ్రఫీ. ఈ విషయంలో దర్శకుడు శ్రీనివాస్ మన్నే సక్సెస్ అయ్యారు. అమెజాన్ ప్రైమ్‌లో హోమ్ థియేటర్ లేదా హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూస్తే, ఆ సౌండ్స్ మిమ్మల్ని సీటు అంచున కూర్చోబెడతాయి. అడవి ప్రాంతం, చీకటి గదులు.. ఇవన్నీ కూడా చాలా సహజంగా, భయం కలిగించేలా చిత్రీకరించారు.
చాలామంది ఈ సినిమాను ఒక చిన్న సినిమాగా, ఏదో మామూలుగా ఉంటుందని అనుకున్నారు. కానీ 'మసూద' లాగే ఇది కూడా కంటెంట్ పరంగా స్ట్రాంగ్‌గా ఉంది. దెయ్యాలు ఉన్నాయా? లేవా? అనే లాజిక్ నుండి మొదలై, క్లైమాక్స్ వరకు ఉత్కంఠను కొనసాగించడం ఈ సినిమా ప్లస్ పాయింట్. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. వారాంతంలో ఇంట్లోనే కూర్చుని ఒక మంచి హారర్ థ్రిల్లర్ చూడాలనుకుంటే 'ఈషా' ఒక బెస్ట్ ఆప్షన్. ఒక్కటి మాత్రం నిజం.. ఈ సినిమా చూశాక ఒంటరిగా గదిలో ఉండాలంటే కొంచెం భయం వేయడం ఖాయం!