Header Banner

ఈరోజు వార్తలు...

  Fri Dec 03, 2021 11:02        Others

* నేడు తిరుపతితో పాటు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన… వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, పంటలను పరిశీలించనున్న సీఎం జగన్
* అమరావతి: నేడు టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం, దర్శి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చ
* అమరావతి: నేడు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్, హాజరుకావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం, పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలపై చర్చ
* నేడు 33వ రోజుకు చేరిన అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్ర… నెల్లూరు జిల్లా తురిమెర్ల నుంచి నేటి పాదయాత్ర ప్రారంభం
* ఆదిలాబాద్‌లో నేడు సీఎస్ సోమేష్ కుమార్ పర్యటన… కరోనా వ్యాక్సినేషన్, ఒమిక్రాన్ అప్రమత్తతపై సమీక్ష
* నేటి నుంచి ముంబై వేదికగా భారత్-న్యూజిలాండ్ రెండో టెస్టు… ఉ.9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
* నేడు జూనియర్ హాకీ ప్రపంచకప్ సెమీస్.. జర్మనీతో తలపడనున్న భారత హాకీ జట్టు.. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్



   Today News